పొరుగింటి పుల్లకూర రుచి అనే సామెత మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సరిగా సరిపోతుంది. మన దగ్గర ఎందరో ప్రతిభావంతులైన యువతులు ఉన్నప్పటికి.. మన దర్శకులు వారికి అవకాశం ఇవ్వరు. అందం, యాక్టింగ్ స్కిల్స్‌లో వారు అదుర్స్ అనిపించుకున్నా.. మన వాళ్లు.. మాత్రం తెలుగుమ్మాయిలు అంటే పెద్దగా ఆసక్తి చూపరు. ఏవో సైడ్ క్యారెక్టర్స్ వంటివి మాత్రమే ఇస్తారు. అయితే ఇక్కడ నిరాదరణకు గురైన ఎందరో టాలీవుడ్ హీరోయిన్లు.. ఇతర భాషల్లో అగ్రతారలుగా వెలుగొందారు. ఆయ ఇండస్ట్రీల్లో టాప్ హీరోల పక్కన హీరోయిన్లుగా నటించారు. అయితే ఇతర ఇండస్ట్రీల్లో ఎంత మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. ఇక్కడ మాత్రం అస్సలు పట్టించుకోరు. ఇలా నిరాదరణకు గురైన వారిలో కొందరు ఏకంగా బాలీవుడ్‌ని శాసించే స్థాయికి ఎదిగారంటే ఆశ్చర్యం వేస్తుంది. అదిగో ఈ కోవకు చెందిన హీరోయిన్ గురించే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం.
నిజం సినిమాలో మహేష్ బాబు తల్లిగా నటించిన యాక్టర్ గుర్తుందా. ఆమె పేరు తాళ్లూరి రామేశ్వరి. అచ్చ తెలుగు మహిళ. ఒకప్పుడు బాలీవుడ్లో టాప్ హీరోయిన్. తన అందం, అమాయకమైన ముఖం, నటనతో బాలీవుడ్‌ని ఏలింది. మరి అదేంటో తెలియదు కానీ ఇంతటి ప్రతిభ ఉన్న ఆమె టాలీవుడ్లో హీరోయిన్గా చేసింది రెండంటే రెండు సినిమాలు మాత్రమే. సీతామాలక్ష్మి, చిన్నోడు పెద్దోడు అనే సినిమాల్లో హీరోయిన్గా చేసింది. అయితే చేసినవి రెండే చిత్రాలు అయినప్పటికి.. ఓ సినిమాకు గాను నంది అవార్డు అందుకుంది. సీతామాలక్ష్మి చిత్రానికి గాను నంది అవార్డు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో ఒక్క సినిమాలో కూడా నటించలేదు.
అచ్చ తెలుగు ఆడపిల్ల అయినటువంటి రామేశ్వరి.. ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి గుర్తింపు పొందారు. దుల్హన్ వోహీ జో పియా మన్ భాయే, అగ్ని పరీక్ష, ఆదత్ సే మజూర్, ఆస్ ఔర్ ప్యాస్, అంధేరా ఉజాలా, వక్త్ వక్త్ కీ రాత్ వంటి వరుస హిట్ సినిమాలలో నటించడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమె పేరు మారు మోగిపోయింది. ఇలా అగ్రతారగా పేరు సంపాదించుకున్న రామేశ్వరి తన చిన్ననాటి స్నేహితుడు దీపక్ సేథ్‌ను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు.
బుల్లితెరపై సందడి..
ఇక వివాహం తర్వాత కుటుంబ బాధ్యతలను చూసుకోవడం కోసం ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇకపోతే 2002వ సంవత్సరంలో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రామేశ్వరి 2003వ సంవత్సరంలో మహేష్ బాబు, తేజ కాంబినేషన్లు వచ్చిన నిజం సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్రలో నటించారు. అదేవిధంగా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన ఈమె బుల్లితెర సీరియల్స్‌లో కూడా నటించారు. జీ తెలుగులో ప్రసారమైన అమెరికా అమ్మాయి అనే సీరియల్లో ఈమె నటించి మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.