Surya Kiran: చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు సూర్య కిరణ్. బాల నటుడిగా 200లకు పైగా సినిమాల్లో నటించటమే కాకుండా.. పదుల సంఖ్యలో అవార్డులను సొంతం చేసుకున్నారు. బాల నటుడిగానే కాదు! దర్శకుడిగా కూడా తన సత్తా చాటారు. సత్యం సినిమాతో దర్శకుడిగా మారి, భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక, 2005లో ప్రముఖ హీరోయిన్ కల్యాణిని వివాహ మాడారు. అయితే, వీరి వివాహ బంధం ఎక్కువకాలం నిలవలేదు. దాదాపు 10 ఏళ్ల కాపురం తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక, వీరిద్దరిదీ ప్రేమ వివాహం అని మీడియాలో వచ్చిన.. వస్తున్న వార్తలపై ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్యాణితో పెళ్లి ఎలా జరిగిందో చెప్పుకొచ్చారు. సూర్య కిరణ్ మాట్లాడుతూ.. ‘‘ మాకు పెళ్లికి ముందు పెద్దగా పరిచయం ఏం లేదు. మాది అరెంజ్డ్ మ్యారేజ్. ఎమ్ఎల్ కుమార్ చౌదరి గారి సినిమా పెదబాబు ఆమె చేస్తోంది. ఆ తర్వాత నేను ఆమెతో ధన సినిమా చేయబోతున్నా. ప్రొడ్యూషర్ను కలవటానికి లొకేషన్‌కు వెళ్లాను. పెదబాబు షూటింగ్ అన్నపూర్ణ స్టూడియో మండువా హౌస్‌లో జరుగుతోంది. అప్పుడు అతను చెప్పాడు. కల్యాణి మలయాళం అమ్మాయి అని. అప్పుడు నేను ఆమెతో మాట్లాడాను. అలా మాట్లాడుతూ.. నేను ఆమె కాళ్ల పట్టీలు చూశా. అలాంటివి నా చెల్లెళ్లకు కొనాలనిపించింది. ఆమెను ఎక్కడ కొన్నారని అడిగాను. చెప్పింది. చాలా రోజుల తర్వాత చెన్నైలో నా ఆటోగ్రాఫ్ సినిమాకు ఫ్యామిలీతో కలిసి వెళ్లాను. ఆ సినిమాకు కల్యాణి ఎవరో అబ్బాయితో వచ్చింది. అది చూసిన మా అమ్మ ‘కల్యాణి ఎవరో లవర్‌తో వస్తోంద’ని అంది. కానీ, ఆ అబ్బాయి ఆమె తమ్ముడని తెలిసింది. థియేటర్లోనే మా ఫ్యామితో కల్యాణికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వాళ్లు చాలా క్లోజ్ అయ్యారు. మా చెల్లెళ్లతో తను బాగా ఉండేది. ఓ రోజు మా అమ్మ నాకు సంబంధాలు చూస్తున్నానని చెప్పింది. నన్ను ఇంటికి రమ్మంది. నేను బయలుదేరుతున్నాను. అప్పుడు కల్యాణి నాకు ఫోన్ చేసి. ‘పెళ్లి చూపులకు వెళుతున్నారంట’ అని అడిగింది. నేను ‘అమ్మ చెప్పిందండి వెళుతున్నాను’ అన్నా. ఆమె ఆల్ ది బెస్ట్ చెప్పింది. తీరా పెళ్లి చూపులకు వెళ్లి చూస్తే అక్కడ తను ఉంది. మా చెల్లెళ్లతో వచ్చిందనుకున్నాను. కానీ, తర్వాతే తెలిసింది. తనే నేను పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయని. పెద్దలు మాట్లాడేసుకున్నారు. పెళ్లయిపోయింది’’ అని అన్నారు. మరి, కల్యాణి, సూర్య కిరణ్‌ల పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : చిరంజీవి ఇచ్చిన గిఫ్ట్ వల్లే ప్రాణాలతో ఉన్నాను...