సెలబ్రిటీలపై ట్రోల్స్ రావడం అనేది మామూలే. కానీ.. ఆ ట్రోల్స్ ఎంతవరకు లిమిట్స్ లో ఉన్నాయి? ఒకవేళ లిమిట్స్ దాటేలా ఉంటే.. దాటకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కోసారి హీరోయిన్స్ పై హద్దులు దాటిపోయి.. వారి పర్సనల్ లైఫ్ మీద.. శరీరాకృతి మీద బాడీ షేమింగ్ ట్రోల్స్ చేస్తుంటారు. అందులో వాస్తవం ఉన్నా లేకపోయినా.. హీరోయిన్స్ పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ రియాక్ట్ మాత్రం పరిస్థితులు వేరేలా ఉంటాయి. రీసెంట్ గా స్టార్ హీరోయిన్ నయనతారపై దారుణంగా ట్రోల్స్ చేశారు నెటిజన్స్. దీంతో ఆ ట్రోల్స్ పై నయనతార రియాక్ట్ అవ్వకపోయినా.. సింగర్ చిన్మయి రంగంలోకి దిగి ట్రోలర్స్ పై ఫైర్ అయ్యింది.
ఇటీవల నయనతార హీరోయిన్ గా కనెక్ట్ అనే మూవీ విడుదలైంది. ఈ సినిమాకి నయన్ భర్త విగ్నేష్ శివన్ నిర్మాత. దీంతో భర్తతో కలిసి కనెక్ట్ మూవీ ప్రివ్యూ షోకి వచ్చిన నయన్.. మీడియా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ క్రమంలో నయన్ ని, భర్త విగ్నేష్ తో ఉన్న పిక్స్, వీడియోస్ ని వైరల్ చేస్తూ.. కొందరు ట్రోలర్స్ సోషల్ మీడియా అసభ్యకర కామెంట్స్ చేయడం ప్రారంభించారు. సరోగసి ద్వారా ఇటీవల నయన్ దంపతులు ఇద్దరు ట్విన్స్ కి జన్మనిచ్చారు. అయితే.. సెటైరికల్ గా నయన్ పిల్లల ప్రస్తావన తీసుకొచ్చి.. పిల్లలు పుట్టినా ఇంకా అలానే ఉందంటూ నెట్టింట కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పై ‘మీటూ’ ఉద్యమంలో యాక్టీవ్ గా ఉండే సింగర్ చిన్మయి రియాక్ట్ అయ్యింది.
నయన్ పై కామెంట్స్ చేసిన ట్రోలర్స్ పై ఘాటుగా స్పందించిన సింగర్ చిన్మయి.. మగాళ్లను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది. ఆమె స్పందిస్తూ.. ‘ఇంట్లో తండ్రి, సోదరుడు ఉన్నప్పుడు తల్లులు కూతుర్లకు దుపట్టా వేయాల్సి వస్తుందేమో. అలా జరిగినా ఆశ్చర్యపోయే అవసరం లేదు. ఎందుకంటే.. కొంతమంది ఫురుషులు ఇంట్లో తమ కూతురు, అక్కాచెల్లెళ్లను చూసినా కోరికలను కంట్రోల్ చేసుకోలేరేమో? నయన్ పై అలాంటి వల్గర్ కామెంట్స్ చేసిన వారిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. వీళ్లు అసలు తల్లి పాలు తాగారా లేదా? అనిపిస్తుంది’ అంటూ మండిపడింది. ప్రస్తుతం చిన్మయి కామెంట్స్ నెట్టింట తెగవైరల్ అవుతున్నాయి. మరి నయన్ పై వచ్చిన ట్రోల్స్ పై, చిన్మయి రియాక్షన్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.