ఐబొమ్మ.. ఈ సైట్ గురించి తెలియని సినిమా ప్రేమికులు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఓ ఓటీటీ ప్లాట్ఫామ్లో సినిమా రిలీజ్ అయినా కూడా వెంటనే ఈ ఐబొమ్మ సైట్లో ప్రత్యక్షం అవుతుంది. గతంలో లాగా మూవీ రూల్స్, టొరెంట్స్ వంటి సైట్ల నుంచి సినిమాలు డౌన్లోడ్ చేసుకుని చూసే వారంతా ఈ వెబ్సైట్ బాట పట్టారు. ఎంతో క్వాలిటీ ప్రింట్ తక్కువ ఎంబీలో అందిస్తున్న నేపథ్యంలో ఈ సైట్‌కు మంచి ఆదరణ లభించింది.
ఇటీవలే తామ కార్యకలాపాలను ఇండియాలో నిలిపివేస్తున్నట్లు ఓ ప్రకటన చేసింది. తమపై ఎన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఎవరూ మద్దతుగా నిలవలేదని, సపోర్ట్ చేయకపోవడం వల్లే వెబ్ సైట్ నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేశారు. ఆ ప్రకటన వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఐబొమ్మ వెబ్‌సైట్‌కు ఎంతో మంది మద్దతు ప్రకటించారు. ట్విట్టర్లో అయితే ఆ సైట్ కోసం ఓ యుద్ధమే చేశారు.
ఆ తర్వాత ఐబొమ్మ అడ్మిన్స్ సైట్‌ను మూసివేయడం లేదు. ఎంతో మద్దతు మాకు లభించింది. అందుకే వారికోసం మళ్లీ సైట్ ను కంటిన్యూ చేస్తున్నాం అంటూ మరో ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు ఐబొమ్మ వెబ్ సైట్ ఇండియన్ యూజర్లకు ఓ షాకింగ్ వార్త చెప్పింది. ఈ వార్త వినగానే ఎంతో మంది యూజర్లు నిర్ఘాంతపోయారు. అదేంటి ఐబొమ్మ అలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ గగ్గోలు పెడుతున్నారు.
విషయం ఏంటంటే.. భారతదేశంలో ఐబొమ్మ వెబ్సైట్ కు సంబంధించి కొన్ని మార్పులు చేసింది. వెబ్సైట్ లో సెర్చ్ ఆప్షన్ ను తొలగించింది. అంతేకాకుండా సైట్లో అప్లోడ్ అయిన చివరి 30 సినిమాలు మాత్రమే భారత యూజర్లు చూడగలరు. పాత అప్లోడ్స్ ని వెళ్లి వెతకాలి అంటే అవ్వదు అని ప్రకటించారు. ఇది తాత్కాలిక నిర్ణయం మాత్రమే అని చెప్పారు.
అయితే అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..? అలా చేయడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి నిర్మించే చిత్రాలను ఇలా ఓటీటీల నుంచి డౌన్లోడ్ చేసుకుని ఉచితంగా యూజర్లకు చూపించడం ద్వారా ఆయా సంస్థలు ఎంతో నష్టపోతున్నాయి. ఇది కూడా ఒక తరహా పైరసీనే కాబట్టి ఇలాంటి సైట్ల విషయంలో విచక్షణతో వ్యవహరించాలంటూ నిర్మాతలు విజ్ఞప్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఐబొమ్మ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.