సెలబ్రిటీ హోదాలు వచ్చాక ఎవరైనా ప్రేక్షకుల నుండి ప్రశంసలు, విమర్శలు రెండింటినీ స్వీకరించాల్సి ఉంటుంది. సెలబ్రిటీలన్నాక వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ కామెంట్స్ చేయడం.. లేదా తమను తామే ఇంకొకరితో కంపేర్ చేసుకోవడం.. ఏదొక పాయింట్ లో మనస్పర్థలు ఏర్పడి సీనియర్స్, జూనియర్స్ ఒకరిపై ఒకరు కామెంట్స్ చేయడం.. ఇవన్నీ చూసి ప్రేక్షకులు వీరి మధ్య ఏదో జరిగిందని, ఇద్దరికీ చెడిందని నమ్మేస్తుంటారు. అంటే.. కొన్నిసార్లు సెలబ్రిటీల మధ్య నిజంగా చెడినా.. బయట కథనాలు ప్రచారం అయినంతగా వాళ్ళైతే చెప్పుకోలేరు. కానీ.. అందరూ వర్క్ చేసేది ఒకే ప్లాట్ ఫామ్ లో కాబట్టి.. ఎప్పటికైనా కలిసి పోతారులే అని ఆడియెన్స్ అనుకుంటారు.
మరి ఇప్పుడీ ఇంట్రో అంతా ఎవరి గురించి? ఆ సెలబ్రిటీలు ఎవరు? అనంటే.. జబర్దస్త్ స్టార్ కమెడియన్ హైపర్ ఆది, పటాస్ – అదిరింది ఫేమ్ సద్దాం హుస్సేన్ ల గురించే. అవును.. మీరు సరిగ్గా గమనిస్తే.. కొంతకాలంగా వీరిద్దరి మధ్య మాటలు లేవు. గతంలో హైపర్ ఆది చేసిన జబర్దస్త్ స్కిట్స్ ట్రెండింగ్ లో ఉండేసరికి.. కామెడీ స్టార్స్ లో స్కిట్స్ చేస్తున్న సద్దాం.. ఈరోజు హైపర్ ఆది, రేపు సద్దాం ట్రెండింగ్ లోకి వస్తాడు అంటూ పంచ్ వేశాడు. దీంతో సద్దాంకి కౌంటర్ గా హైపర్ ఆది స్పందిస్తూ.. తనను స్కిట్స్ బీట్ చేయాలంటే.. అవి ఇవి అంటూ మిలియన్స్ లెక్కలు చెప్పాడు. అలాగే సినిమాలలో నాన్ బాహుబలి రికార్డ్స్ ఎలాగో.. యూట్యూబ్ లో హైపర్ ఆది రికార్డ్స్ అలాగా అని కౌంటర్ వేశాడు. అక్కడినుండి వీరిద్దరి మధ్య మాటలు లేవని తెలుస్తోంది.
ఈ క్రమంలో న్యూ ఇయర్ సమీపిస్తుండటంతో ఈటీవీ వారు బుల్లితెర సెలబ్రిటీలందరితో ‘వేర్ ఈజ్ ది పార్టీ’ అని ఓ ఎంటర్టైన్ మెంట్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు. దీనికి యాంకర్ సుమ హోస్ట్ కాగా.. తాజాగా ఈ స్పెషల్ ప్రోగ్రాం నుండి ప్రోమో రిలీజ్ చేశారు. ప్రోమో అంతా డాన్సులు, ఆటలు పాటలతో సందడిగా సాగింది. ఇక అన్ని ప్రోమోల మాదిరే ఈ ప్రోమోలో కూడా ఏదొక ట్విస్ట్ పెట్టాలిగా.. ఈసారి కమెడియన్స్ హైపర్ ఆది, సద్దాం హుస్సేన్ ల గొడవని తెరపైకి తీసుకొచ్చారు. ఇదే స్టేజ్ పై సద్దాంకి, తనకి మధ్య మనస్పర్థల కారణంగా దూరం పెరిగిందని స్వయంగా ఆదినే చెప్పడం విశేషం.
ఇదిలా ఉండగా.. లేటెస్ట్ ప్రోమోలో స్టేజ్ పైకి సద్దాంని పిలిచిన ఆది.. సద్దాంకి, తనకు మధ్య 2022లో చిన్న చిన్న మనస్పర్థలు వచ్చాయని, అవన్నీ 2023లో తొలగిపోయి కలిసుండాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. అనంతరం ఇద్దరూ కేక్ కట్ చేసి, ఒకరికొకరు తినిపించుకున్నారు. దీంతో ఇద్దరి ఫ్యాన్స్ హ్యాపీ. కానీ.. అసలు వీరిద్దరి మధ్య ఆ తలెత్తిన మనస్పర్థల వల్లే ఇంత దూరం పెరిగిందా? ఇంకా వేరే ఏవైనా కారణాలు ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. చూడాలి మరి ‘వేర్ ఈజ్ ది పార్టీ’ పూర్తి ఎపిసోడ్ లో ఆ విషయాలను షేర్ చేసుకుంటారేమో! మరి సద్దాం, హైపర్ ఆదిలలో ఎవరు బెస్ట్ కమెడియన్ అనుకుంటున్నారో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.