ఏ మేరా జహాన్ అనే పాట గురించి గబ్బర్ సింగ్ సినిమాలోని.. ‘పాటొచ్చి పదేళ్ళయింది. అయినా క్రేజ్ తగ్గలా’ అంటూ అలీ ఒక డైలాగ్ చెప్తారు. గబ్బర్ సింగ్ సినిమా 2012 లో రిలీజ్ అయ్యింది. అప్పటికి ఖుషి సినిమా మీద ఉన్న క్రేజ్.. ఆ తర్వాత ఇంకో పదేళ్లు గడిచినా అస్సలు తగ్గలేదు. అస్సలు తగ్గేదేలే అన్నట్టు ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఖుషి సినిమా అంటే అందరి మైండ్స్ లో బాగా రిజిస్టర్ అయిన వాటిలో నడుము సీన్ ఒకటి. భూమిక, పవన్ కళ్యాణ్ మధ్య జరిగే ఆ బ్యూటిఫుల్ రొమాంటిక్ సీన్ అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. ఎస్.జె. సూర్య దర్శకత్వంలో 2001 లో వచ్చిన ఖుషి సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో పాటలు, పవన్ కళ్యాణ్ స్టెప్పులు, డైలాగ్ డెలివరీ అప్పట్లో ఫ్యాన్స్ ని ఒక ఊపు ఊపేసింది.
సినిమా వచ్చి 21 ఏళ్ళు గడిచినా ఇంకా ఆ సినిమా మీద క్రేజ్ తగ్గలేదు. ముఖ్యంగా నడుము సీన్ మీద ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఖుషి సినిమాని డిసెంబర్ 31న రీ-రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 4కేలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు మేకర్స్. జనవరి 6 వరకూ ప్రదర్శించనున్నారు. ఈ క్రమంలో పవన్ ఫ్యాన్స్ థియేటర్స్ లో సందడి చేశారు. పవన్ కళ్యాణ్ కనిపించగానే పూనకాలతో ఊగిపోయారు. థియేటర్స్ లో టపాసులు పేల్చి రచ్చ రచ్చ చేశారు. ఇక భూమిక నడుము సీన్ రాగానే.. ఫ్యాన్స్ అరుపులు, కేకలు, ఈలలతో గోల గోల చేశారు. మొత్తానికి ఖుషి రీ-రిలీజ్ అంటే ఒక పండగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్. ఖుషి అంటే ఒక ఎమోషన్ అని మరోసారి రుజువు చేశారు.
పవన్ ఫ్యాన్స్ కే కాదు, ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది సెలబ్రిటీలకు ఆ నడుము సీన్ అంటే ఒక ఎమోషన్. ఆ సీన్ నితిన్ నుంచి బుల్లితెర సెలబ్రిటీల వరకూ చాలా మంది ఇమిటేట్ చేశారు. అంతలా ఆ సీన్ జనాల్లో రిజిస్టర్ అయిపోయింది. వల్గారిటీ లేకుండా.. అందంగా ఒక రొమాంటిక్ సీన్ ని చిత్రీకరించడం దర్శకుడికే సాధ్యం. నడుము చూసావ్ అని భూమిక అడిగే ప్రశ్నకు.. పవన్ లాజికల్ గా ఇచ్చే ఆన్సర్ కూడా అదిరిపోతుంది. ఇదొక్కటే కాదు.. ఈ సినిమాలో చాలా డైలాగులు బాగుంటాయి. పవన్ ఫ్యాన్స్ కి సినిమా మొత్తం ఒక వ్యసనం అంతే. మరి ఖుషి రీ-రిలీజ్ వెర్షన్ ని మీరు చూసారా? చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.