నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం ‘అఖండ’. డిసెంబర్ 2న థియేట్రికల్ రిలీజైన ఈ సినిమా అఖండమైన విజయాన్ని నమోదుచేసి నెలరోజులు గడిచినా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. ఇప్పటికే 130కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ మధ్యకాలంలో 1, 2 వారాలు సినిమాలు థియేటర్లలో ఆడటం గగనం అయిపోయింది.
ఇలాంటి సమయంలో అఖండ సినిమా విడుదలైన 4 వారాలకు పైగా ప్రదర్శించబడుతూ.. కొన్ని కేంద్రాలలో హౌస్‌ఫుల్ కలెక్షన్లను నమోదు చేయడం విశేషం. ఇదిలా ఉండగా.. అఖండ మేకర్స్ ఇప్పటికే డిస్నీ+ హాట్‌స్టార్‌తో 6-వారాల OTT విడుదల ఒప్పందంపై సంతకం చేశారు. కానీ సినిమా ఇప్పటికి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ చూసి, OTT విడుదలను రెండు వారాల పాటు వాయిదా వేయాలని నిర్మాత హాట్‌స్టార్‌ను కోరినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. డిస్నీ హాట్‌స్టార్ అఖండ OTT వాయిదా అభ్యర్థనను తిరస్కరించినట్లు తెలుస్తుంది.ఎందుకంటే ఈ సంక్రాంతి సీజన్లో సినిమాను అఖండ సినిమాని ఎలాగైనా స్ట్రీమింగ్ చేయాలని OTT దిగ్గజం భావిస్తోంది. అందుకు సంబంధించి OTT ప్రీమియర్ తేదీని త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. అఖండ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఊపుతో.. ఇప్పుడు డిస్నీ హాట్‌స్టార్ క్యాష్ చేసుకోవాలని ప్లాన్ లో ఉన్నట్లు టాక్. ఒకవేళ అఖండ OTT లో రిలీజైతే మాత్రం డిస్నీ+ హాట్‌స్టార్‌కి మూలస్తంభంగా నిలిచే ఛాన్స్ లేకపోలేదు. అందుకే ఈ ఫెస్టివల్ మూడ్ ని అఖండతో కంటిన్యూ చేయాలనుకుంటుంది హాట్ స్టార్. మరి అఖండ OTT రిలీజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.