ఈ మద్య ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలు కావడమో లేదా చనిపోవడం జరుగుతుంది. లాస్ ఏంజెల్స్‌లో జరిగిన కారు ప్రమాదంలో హాలీవుడ్ నటి అన్నే హెచ్చి కి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే..
ప్రముఖ హాలీవుడ్ నటి అన్నే హెచ్చి కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైంది. మార్ విస్టాలో అన్నే హిచ్చి తన కారులో ప్రయాణిస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ ఇంటిని బలంగా కొట్టింది. ఈ ఘటనలో రెండు అంతస్థుల ఇళ్లు స్వల్పంగా ధ్వంసమైంది. అన్నే హెచ్చి బ్లూ కలర్ మినీ కూపర్‌లో ప్రయాణిస్తున్నారు. ప్రమాద సమయంలో భారీ మంటలు వ్యాపించాయి. మంటలను పూర్తిగా ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందికి గంటకు పైగా సమయం పట్టింది.
హాలీవుడ్ కి చెందిన అన్నే హిచ్చి 1990 దశకంలో ఫేమస్ నటిగా వెలుగొందింది. టీవీ షో ‘అనదర్ వరల్డ్’తో బాగా గుర్తింపు సంపాదించింది. ఈ సీరియల్ లో విక్కీ హడ్సన్ ,మార్లే లవ్ గా ద్విపాత్రాభినయం చేసింది, ఆమె నటనకు డేటైమ్ ఎమ్మీ అవార్డు వచ్చింది. ఆమె డోనీ బ్రాస్కో, సిక్స్ డేస్ సెవెన్ నైట్స్, వాగ్ ది డాగ్ వంటి చిత్రాలలో కూడా నటించింది.