గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు సీనీ ప్రముఖులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ‘టైటానిక్’ చిత్రంలో నటించిన హాలీవుడ్ నటుడు డేవిడ్ వార్నర్(80) మృతి చెందారు.
‘టైటానిక్’ ఫేమ్ డేవిడ్ వార్నర్ కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించి మరణించారు. టైటానిక్ మూవీలో ఆయన ఓ కీలక పాత్రలో కనిపించారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో తన నటనతో మెప్పించారు. పీటర్ హాల్ దర్శకత్వం వహించిన 1965లో హామ్లెట్ టైటిల్ రోల్లో డేవిడ్ వార్నర్ తన అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. అలాగే ‘ది ఒమెన్’, ‘ట్రాన్’ వంటి చిత్రాలలో నటించాడు.
డేవిడ్ వార్నర్ 1962లో మొదటి సారిగా సినిమాల్లోకి వచ్చి గత ఆరు దశాబ్దాలుగా హాలీవుడ్ చిత్రాల్లో ఎక్కువగా విలన్ పాత్రల్లో నటించి మెప్పించారు. ఆయన మృతిపై సెలబ్రెటీలు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది చదవండి: వీడియో: బాలయ్య మంచిమనసు.. అభిమాని పిలవగానే ఇంటికెళ్లి భోజనం చేశాడు!