Nandamuri Balakrishna: అభిమాన సినీతారలు పర్సనల్ గా అభిమానులను కలవడమే అరుదుగా జరుగుతుంటుంది. అలాంటిది అభిమానించే స్టార్ హీరో ఏకంగా కలిసి భోజనం చేస్తే.. ఆ అభిమాని ఆనందం మాటల్లో చెప్పలేరు. అందుకే ఫ్యాన్స్ కూడా ఆ హీరో గురించి ఎంతో అభిమానంగా మాట్లాడుతుంటారు. అంతే అభిమానంగా బయట చెబుతుంటారు. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఓ అభిమాని ఇంట్లో భోజనం చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా కొట్టినా, పెట్టినా బాలయ్యే అని చెబుతుంటారు ఫ్యాన్స్. వారి మాటలను నిజం చేస్తూనే బాలయ్య తిరిగి అభిమానులను ప్రేమిస్తుంటాడు. ప్రస్తుతం బాలయ్య తన 107వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ క్రమంలో బాలయ్య తన షూటింగ్ తర్వాత దగ్గరలోని ఓ అభిమాని ఇంటికి వెళ్లి భోజనం చేశాడట. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.