సినిమా ఇండస్ట్రీలో సహజీవనం అనేది చాలా కామన్ థింగ్ అయిపోయింది. పెళ్ళి తర్వాత భాగస్వామి అర్ధం చేసుకోకపోతే వదిలేయడం బాగోదు కాబట్టి.. పెళ్ళికి ముందే సహజీవనం చేసి అర్ధం చేసేసుకుంటున్నారు. నచ్చకపోతే టాటా బై బై చెప్పేస్తున్నారు. నచ్చితే కలిసి ఏడడుగులు వేస్తున్నారు నయనతార, విగ్నేష్ శివన్ లలాగా. సరే ఈ మూణ్ణాళ్ల ముచ్చట పక్కన పెడితే మేల్ భాగస్వామితో కష్టమే అమ్మాయిలకి. అందులోనూ గ్లామర్ ఫీల్డ్ లో మరీ ఘోరంస్ అండోయ్. ప్రేమ ఎక్కడ ఉంటే అక్కడ పొసెసివ్ నెస్ ఎక్కువ ఉంటుంది. సినిమా హీరోయిన్ల విషయంలో కూడా తమ మేల్ భాగస్వాములు కూడా ఇలానే ఉంటారు. ఈ పరిధిలోనే ఉండు, ఆ సినిమా వద్దు, ఆ హీరోతో వద్దు అని రిస్ట్రిక్షన్స్ పెడుతుంటారు. మేల్ భాగస్వాములు కాబట్టి.. మీ మేలు కోరుతున్నా అంటూ ఒక ఎమోషనల్ డవిలాగు ఒకటి ఇసిరిపరేస్తాడు.
ఆయనేకేం పోయింది, ఇక్కడ ఆడ లేడీస్ గోలేగా పోయేది. వారికంటూ ఇష్టాలు, లక్ష్యాలు, గోల్సు ఎక్సట్రా ఉంటాయి కదా అనేది లేడీస్ వెర్షన్. తాజాగా కోలీవుడ్ హీరోయిన్ పరిస్థితి కూడా అయ్యో పాపం అన్నట్టు తయారైంది. తమిళనాట సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన వాణి భోజన్.. ఇప్పుడిప్పుడే కోలీవుడ్ లో హీరోయిన్ గా ఎదుగుతోంది. తెలుగులో ప్రేమ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బుట్ట భోజన్.. మీకు మాత్రమే చెప్తా సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం నవీన్ చంద్ర సరసన ఒక సినిమా చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోందా సినిమా. ఇది మాత్రమే కాకుండా ఆమె చేతిలో డజను దాకా సినిమాలు ఉన్నాయి. సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్ లలోనూ అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. రీసెంట్ గా ఈమె నటించిన తమిళ్ రాకర్స్ అనే వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది. ఆ సిరీస్ బ్లాక్ బస్టర్ అయ్యింది. మరో తమిళ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది.
లైఫ్ సెట్ అవుతుందన్న సమయంలో ఈమె బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ఈమె పాలిట పుల్ డోజర్ లా తయారయ్యాడు. వాణి భోజన్ ని వెనక్కి లాగేందుకు ప్రయత్నిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. జర్నీ, రాజా రాణి వంటి సినిమాలతో తనకంటూ తెలుగులో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు జైతో.. వాణి భోజన్ సహజీవనం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సహజీవనమే ఆమె కొంప ముంచుతుందని తెగ ఫీలవుతుందట. సహజీవనం వల్ల తన జీవితం మొత్తం.. జై చేతుల్లోకి వెళ్లిపోయిందని.. దర్శక, నిర్మాతలు ఆమెను కలిసే పరిస్థితి లేదని వాపోతుందట.
సినిమా అవకాశాలు రావాలంటే ముందు జై కాంపౌండ్ ని దాటుకుని రావాలట. అతను యస్ చెప్తే.. వాణి భోజన్ కి సినిమా భోజనం ఉంటుంది. లేదంటే ఇక అంతే. ఈ హీరో వల్ల తనకి చాలా మూవీ ఆఫర్లు పోయాయని ఆమె భాదపడిందట. దీంతో విసుగు చెందిన ఆమె జైకి బ్రేకప్ చెప్పేసిందని ప్రచారం జరుగుతోంది. తన జీవితంలో అదే పోన్లే అని చోటిస్తే.. తన జీవితంలో తనకే చోటు లేకుండా చేస్తున్నాడని ఆమె జైకి గుడ్ బై చెప్పేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా జై, అంజలి విషయంలో కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. మరి ఈ వ్యవహారంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.