తెలుగులో ఈ బ్యూటీ చేసింది ఒక్కటంటే ఒక్కటే సినిమా. అయితేనేేం పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించింది. ఇప్పుడు పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. మరి ఈమెని గుర్తుపట్టారా?
తెలుగులో ఆమె చేసింది జస్ట్ ఒకే ఒక సినిమా కానీ.. పేరు, ఫేమ్ మాత్రం స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో సంపాదించింది. కుర్రాళ్లయితే గుండెల్లో పెట్టేసుకున్నారు. చంద్రబింబం లాంటి మొహం, చారడేసి కళ్లతో కట్టిపడేసింది. ఈ మధ్య ఆమె.. పెళ్లి-పిల్లలు గురించి చేసిన కామెంట్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. దీంతో దక్షిణాదిలో దాదాపు ఎక్కడా చూసిన ఆమె పేరే వినిపిస్తోంది. పలువురు స్టార్ హీరోలు కూడా ఆమెతో సినిమాలు చేసేందుకు రెడీ అయిపోతున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ ఫొటోలు కనిపిస్తున్న చిన్నారో ఎవరో కాదు ‘సీతారామం’లో సీతగా మన అందరి హృదయాలు దోచేసిన మృణాల్ ఠాకూర్. ఈమెని చూస్తే అచ్చమైన తెలుగమ్మాయి అనుకుని భ్రమపడతారు. కానీ పక్కా నార్త్ ఇండియన్. బాలీవుడ్ నుంచి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ‘కుంకుమ భాగ్య’ సీరియల్ తో ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్.. హీరోయిన్ గా అదృష్టాన్ని పరీక్షించుకుంది. పేరు సంపాదించింది. కానీ వెండితెరపై మాత్రం అంతలా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. హిందీలో విట్టి దండూ, లవ్ సోనియా, సూపర్ 30, బత్లా హౌస్, ఘోస్ట్ స్టోరీస్ లాంటి సినిమాల్లో నటించింది.
ఇక ఈ ఏడాది విడుదలైన ‘జెర్సీ’ రీమేక్ తో కాస్త గుర్తింపు వచ్చింది. ఈ మధ్య వచ్చిన ‘సీతారామం’, మృణాల్ కు టాలీవుడ్ లో స్టార్ హోదా తెచ్చిపెట్టింది. సీతామహాలక్ష్మి పాత్ర, అందులో అభినయం ఆమెలోని ప్రతిభని బయటపెట్టింది. దీంతో ఆమెకి ఛాన్సులు క్యూ కడుతున్నాయి. ఎన్టీఆర్ సినిమా కోసం ఆమెని సంప్రదించారనే టాక్ వచ్చింది. కానీ అధికారిక ప్రకటన అయితే ఏం రాలేదు. ప్రస్తుతం మృణాల్ చేతిలో నాలుగు హిందీ సినిమాలున్నాయి.
మరోవైపు మృణాల్.. తన పెళ్లి గురించి ఈ మధ్య షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘నా మనసులో ఏం ఉంటుందో అర్ధం చేసుకున్నవాడే.. నాకు జీవిత భాగస్వామిగా రావాలని కోరుకుంటున్నాను. ఒకవేళ అలాంటి వ్యక్తి దొరక్కపోతే పెళ్లి చేసుకోను. పెళ్లి కాకపోయినా పిల్లల్ని మాత్రం కనాలని ఉంది. నా అండాన్ని భద్రపరుచుకుని టెస్ట్ ట్యూబ్ ద్వారా అయిన బిడ్డని కని అమ్మ అని పిలిపించుకోవాలని ఉంది. ఈ విషయాన్ని మా అమ్మకి చెబితే ఓకే అంది. నా అభిప్రాయాన్ని ఆమె సంతోషంగా స్వాగతించింది’అని మృణాల్ చెప్పింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు.. ‘సీతారామం’ అభిమానులకు షాకిచ్చాయి కూడా. మరి మృణాల్ చిన్నప్పటి ఫొటోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.