సినీ ఇండస్ట్రీలో హీరోలుగా నిలదొక్కుకున్నాక కెరీర్ పరంగా ఎంత సెలెక్టివ్ గా వెళితే అంత మంచిదని అంటుంటారు. ఫ్యూచర్ సినిమాల గురించి ఇండస్ట్రీలో కొందరి హీరోల అంచనాలు నిజమవుతుంటాయి.. కొందరి విషయంలో ఫెయిల్ అవుతుంటాయి. కానీ చివరికి సినిమా ఎవరు చేసినా ఫలితం మాత్రం మారదు. ఇండస్ట్రీలో సినిమా కథలు ఒక హీరో దగ్గరే ఆగిపోవు. ఒకవేళ విన్న వెంటనే ఓకే అయిపోతే ఆ స్టోరీ లక్కీ అనవచ్చు.
అలా రేర్ గా జరుగుతుంటాయి. కొన్ని స్టోరీలు మాత్రం చాలామంది రిజెక్ట్ చేసినా ఏదొక హీరో ద్వారా తెరమీదకు వస్తుంటాయి. అలాంటి కథలు ప్లాప్ అయితే రిజెక్ట్ చేసిన హీరోలు ముందే చెప్పాము కదా అనుకుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ రీసెంట్ గా విడుదలైన రెండు సినిమాలను ముందే రిజెక్ట్ చేసి పెద్ద ప్రమాదం నుండి తప్పుకున్నాడని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆ సినిమాలేవో కాదు.. ‘ఆడాళ్ళు మీకు జోహార్లు’, ‘రాధేశ్యామ్’.ప్రస్తుతం వెంకీమామ వరుస హిట్లతో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవలే నారప్ప, దృశ్యం 2 సినిమాలతో మెప్పించిన ఆయన.. ఇప్పుడు ఎఫ్3 సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే.. ఆడాళ్ళు మీకు జోహార్లు మూవీ ముందు వెంకీ దగ్గరికే వెళ్లిందట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైన ఈ సినిమా ఎందుకో కార్యరూపం దాల్చలేదు. చివరికి ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అలాగే రాధేశ్యామ్ స్టోరీ పాయింట్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి గతంలోనే చెప్పాడట.
ఆ స్టోరీ పాయింట్ ని వెంకీ రిజెక్ట్ చేసేసరికి.. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న రాధాకృష్ణ కుమార్ పాయింట్ ని డెవలప్ చేసి ప్రభాస్ కి వినిపించాడు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యామ్ మూవీ ఊహించిన స్థాయిలో ఫలితం రాబట్టలేకపోయింది. ఈ విధంగా వెంకీమామ రెండు ప్రమాదాల నుండి తప్పించుకున్నాడని అంటున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం వెంకీమామ సూపర్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ టైంలో ఇలాంటి సినిమాలు చేసుంటే ఆయన కెరీర్ కే చాలా ఇబ్బందులు ఏర్పడేవి అని ఇండస్ట్రీ టాక్. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.