Hero Surya: సందర్భం ఏదైనా కావచ్చు.. సహాయం చేయటంలో నటుడు సూర్య ఫ్యామిలీ ఎప్పుడూ ఓ అడుగు ముందుంటుంది. ఈ ఫ్యామిలీ కేవలం పకృతి విపత్తుల సమయంలోనే కాదు.. మిగిలిన అన్ని సమయాల్లో అవసరం ఉన్న వారికి సహాయం చేస్తూనే ఉంటుంది. ‘‘అగరమ్’’ ఫౌండేషన్ ద్వారా కొన్ని వేల మంది నిరుపేద విద్యార్థులను చదివిస్తోంది. తండ్రి శివకుమార్ కావచ్చు.. సూర్య, కార్తీలు కావచ్చు.. ప్రతి నెలా ఏదో ఒక విషయంలో.. ఎవరో ఒకరికి సహాయం చేస్తూనే ఉన్నారు. తాజాగా, హీరో సూర్య 6 లక్షల రూపాయలు విలువ చేసే ఓ వ్యానును తమిళనాడు పోలీసు శాఖకు డొనేట్ చేశారు. తన ప్రొడక్షన్ హౌస్ అయిన 2డీ ఎంటర్టైన్మెంట్ పేరు మీద ఈ వ్యానును దానంగా ఇచ్చారు. ‘‘కావల్ కారంగల్’’ కోసం ఈ వ్యానును ఉపయోగించనున్నారు. ఈ వ్యాను ద్వారా ఇళ్లు లేని వారికి, నిరుపేదలకు ఆహారాన్ని అందించనున్నారు.
కాగా, సూర్య ప్రస్తుతం బాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం భారీ వ్యయంతో మత్స్యకారుల ఇళ్లను పోలిన ఇళ్లను నిర్మించారు. సాధారణంగా షూటింగ్ తర్వాత ఇలాంటి ఇళ్లను కూల్చి వేస్తూ ఉంటారు. కానీ, సూర్య మాత్రం అలా చేయలేదు. ఆ ఇళ్లను ఇళ్లులేని మత్స్యకారులకు ఇచ్చేయాలని నిర్ణయించారు. సూర్య తీసుకున్న నిర్ణయంతో సదరు మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులైతే మా హీరో సూపర్ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. మరి, సూర్య మంచి మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : నందమూరి బాలయ్యకు సర్జరీ.. త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్థనలు..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.