నందమూరి బాలయ్యకు సర్జరీ.. త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్‌ ప్రార్థనలు..

Surgery for Balakrishna

Nandamuri Balakrishna: ‘అఖండ’ సినిమాతో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అందుకున్న నందమూరి బాలక్రిష్ణ వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్‌ రావిపూడితో మరో సినిమా చేయనున్నారు. అనిల్‌ రావిపూడి సినిమా తర్వాత బాలయ్య, బోయపాటి డెడ్లీ కాంబో నాలుగో సారి రిపీట్‌ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ కలిసి చివరగా ‘‘అఖండ’’సినిమా చేశారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే బాలయ్య బాబు ఓ ప్రమాదానికి గురయ్యారు. కుడి భుజానికి గాయం అవ్వటంతో హైదరాబాద్‌ కేర్‌ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్నారు.

 Surgery for Balakrishna

తాజాగా, మరోసారి బాలక్రిష్ణ సర్జరీ చేయించుకున్నారు. గత కొన్ని రోజులనుంచి మోకాలి నొప్పితో బాధపడుతున్న ఆయనకు కేర్‌ ఆసుపత్రి వైద్యులు సర్జరీ చేశారు. బాలయ్యకు జరిగింది మైనర్‌ సర్జరీనేనని, ఆయన ఆరోగ్యం పూర్తిగా బాగుందని సర్జరీ చేసిన వైద్యులు తెలిపారు. అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని, కొద్దిరోజులు ఇంట్లో విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని స్పష్టం చేశారు. కేర్‌ ఆసుపత్రి వైద్యులతో ఆయన దిగిన ఓ ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై అభిమానులు స్పందిస్తూ.. బాలయ్య బాబు త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. గెట్‌వెల్‌ సూన్‌ అంటూ పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. మరి, ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇవి కూడా చదవండి : బాలయ్యతో బోయపాటి మరో సినిమా?.. ఈసారి మామూలుగా ఉండదు..

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.