హీరో శర్వానంద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద అదుపు తప్పి ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ప్రస్తుతం ఆయన ఆస్పిత్రిలో చికిత్స పొందుతున్నారు.
టాలీవుడ్ ప్రముఖ నటుడు హీరో శర్వానంద్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శనివారం రాత్రి హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద ఆయన కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శర్వానంద్ కు తెలికపాటి గాయాలైనట్లు సమాచారం. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు.. శర్వానంద్ ను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లారు. ఏం జరిగిందంటూ వైద్యుడిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, పెద్దగా ఖంగారు పడాల్సిన పని లేదని వైద్యులు తెలిపారు. ఆ తర్వాత శర్వానంద్ కుటుంబ సభ్యులు ప్రమాదానికి గురైన రేంజ్ రోవర్ కారును వారి ఇంటికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. అయితే, కారులో సేఫ్టీ ఫీచర్స్ ఉండడం వల్ల తీవ్రమైన గాయాలు కాలేదని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ ఏం జరిగిందంటూ ఆరా తీస్తున్నారు. హీరో శర్వానంద్ కు రోడ్డు ప్రమాదం అని తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే కోలుకోవాలంటూ దేవుడిని ప్రార్థిస్తున్నారు.