నవదీప్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. జై సినిమాతో హీరో గా టాలీవుడ్ కు పరిచయమైన నవదీప్ అనంతరం చాలా సినిమాలో నటించాడు. గౌతమ్ SSC, చందమామ, ఆర్య-2 వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో నవదీప్ సినిమాల్లో అంతగా కనిపించడంలేదు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటున్నాడు. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటాడు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. తనకు పంపిన స్పెషల్ గిఫ్ట్ ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు.
“ప్రేమకు హద్దులు లేకుండే అకేషన్ ఏమీ లేకున్నా ఇలా గిఫ్ట్స్ వస్తుంటాయి. థ్యాంక్స్ బావ. ఈ సమాజం ఒప్పుకోకపోయినా ఆండ్రాయిడ్‌తో ఎయిర్‌పొడ్స్ వాడతా” అంటూ నవదీప్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. ఆర్య 2 చేసినప్పటి నుంచి బన్నీ, నవదీప్ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. రీసెంట్‌గా సెర్బియాలో బన్నీ 40వ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లోనూ నవదీప్ పాల్గొన్న సంగతి తెలిసిందే. చాలా మంది నటుల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంటుంది. అలాంటి వారిలో బన్నీ, నవదీప్ ఉన్నారు. వీరిద్దరి మధ్య బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతుంటుంది. ప్రత్యేకంగా ఓ అకేషన్ అంటూ లేకుండా అప్పుడప్పుడు బన్నీ నుంచి నవదీప్ కి సర్ ప్రైజ్ గిఫ్ట్ వస్తుంటాయి. తాజాగా అల్లు అర్జున్ ఎయిర్‌పాడ్స్ ను నవదీప్ కి స్పెషల్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నవదీప్ అభిమానులతో షేర్ చేసుకున్నాడు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.