సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతున్న సంగతి తెలిసిందే. టైటిల్ నుండి సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నివిధాలుగా ఫ్యాన్స్ లో అంచనాలు పెంచిన ఈ సినిమాను ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ తెరకెక్కించాడు. సర్కారు వారి పాట చిత్రం మహేష్ బాబు కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. విడుదలకు ముందు ట్రైలర్ ని అద్భుతంగా కట్ చేసి హైప్ క్రియేట్ చేసి.. వింటేజ్ మహేష్ బాబును గుర్తుచేశారు మేకర్స్. లవ్, యాక్షన్, కామెడీ, మాస్, ఎమోషనల్ ఇలా అన్ని అంశాలను మేళవించిన ఈ సినిమా.. పక్కా కమర్షియల్ హిట్ గా థియేటర్లలో దూసుకుపోతుంది.
ఇక మహేష్ కెరీర్‌లోనే ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా సర్కారు వారి పాట నిలిచింది. ఇంక రెండో రోజు కూడా కలెక్షన్ల జోరు ఏమాత్రం తగ్గడం లేదు. సెకండ్ డే కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట మాస్ కలెక్షన్లతో దూసుకుపోతుంది.
#SarkaruVaariPaata Day2 Shares
👉Nizam – 5.2cr
👉Ceeded – 1.45cr
👉UA Area – 1.65cr
👉East – 1.08cr
👉West – 45L
👉Guntur – 51L
👉Krishna – 89L
👉Nellore – 41LTotal AP&TS Day2 Share: 11.64cr 👍
Extraordinary Day2 👌 (Considering working day)#BlockBusterSVP@urstrulyMahesh pic.twitter.com/b9wV8TQ2Tv
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) May 14, 2022
ఏపీ, తెలంగాణలో రెండు రోజు కలెక్షన్స్: 11.64 కోట్ల రూపాయలు కాగా.. రెండు రోజులకు కలిపి.. రెండు రాష్ట్రాల్లో 48 కోట్ల రూపాయలకు పైగా షేర్ సాధించింది.
బ్యాంకు లోన్ రికవరీ విషయంలో సంపన్నులు, సామాన్యుల పరంగా ఎలాంటి తేడా చూపించకూడదనే నేపథ్యంతో సర్కారు వారి పాట తెరకెక్కింది. సినిమాలో సముద్రఖని, నదియా, నాగబాబు, తనికెళ్ళ భరణి, సుబ్బరాజ్, వెన్నెల కిషోర్ నటించారు. అందులోనూ మహేష్ సరసన కీర్తి సురేష్.. తమన్ సంగీతం.. ఇలా సర్కారు వారి పాటకు అన్నీ అదనపు ఆకర్షణగా నిలిచి సినిమా ఘన విజయం సాధించడానికి హెల్ప్ అయ్యాయి. ఇక కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న సర్కారు వారి పాట సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Supreme Court: ముందు పెద్దచేపల సంగతి చూడండి: సుప్రీం కోర్టు సంచనల తీర్పు