Ajith: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు కేవలం తమిళనాడులోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ ఆయన్ని ముద్దుగా తల అనిపిలుస్తుంటారు. కొంతమంది ఫ్యాన్స్ ఆయనకోసం ప్రాణాలు సైతం ఇచ్చేంత పిచ్చిలో ఉంటారు. అజిత్ కూడా ఫ్యాన్స్ అంటే అంతే అభిమానంగా ఉంటారు. వారికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. తాజాగా, తన కోసం ఎంతో ప్రయాసపడి రిషికేష్ వచ్చిన ఫ్యాన్స్‌తో అజిత్ ఎంతో ప్రేమగా మాట్లాడారు. వారిపై సెటైర్లు కూడా వేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. అజిత్‌కు బైక్ రైడింగ్ అంటే ఎంతో ఇష్టం అన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం బైకు మీద కొన్ని ప్రాంతాలు చుడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రిషికేష్ వెళ్లారు.
అజిత్‌ను కలవటానికి ముందుగానే అక్కడికి వచ్చిన కొంత మంది ఫ్యాన్స్.. ఆయన సరిగ్గా ఎక్కడ ఉన్నారో తెలుసుకోవటానికి నానా తిప్పలు పడ్డారు. ఎట్టకేలకు ఆయన ఉన్న ప్రదేశాన్ని కనుకున్నారు. ఆయన దగ్గరకు ఎంతో సంతోషంతో పరిగెత్తుకుంటూ వెళ్లారు. ‘‘సార్.. సార్’’ అంటూ ఆయన ఫుల్ డ్రైవింగ్ సూట్లో బైకు దగ్గర నిల్చుని ఉండగా వెళ్లారు. అభిమానుల అరుపులు విన్న ఆయన వెంటనే వెనక్కు తిరిగారు. ‘‘ ఎక్కడినుంచి వస్తున్నారు’’ అని అడిగారు. వారు వెంటనే ‘‘ కోయంబత్తూరు నుంచి సార్.. మిమ్మల్ని మూడు రోజులనుంచి వెతుకుతున్నాము’’ అని అన్నారు. దానికి అజిత్ ‘‘వెతుకుతున్నారా.. నేనేమన్నా హంతకుడ్నా? లేక దోపిడీ దొంగనా?’’ అంటూ సెటైర్ వేశారు. దానికి ఫ్యాన్స్ నవ్వేసి ‘‘ లేదు సార్! మిమ్మల్ని చూడటానికి.. పొద్దున్నుంచి ఎదురుచూస్తున్నాము.
నిద్రపోకుండా వస్తే మిమ్మల్ని చూడొచ్చని వెంటనే వచ్చేశాము’’ అని అన్నారు. అజిత్ ఒక్కొక్కటిగా తన చేతి బ్లౌజులు, ముఖానికి ఉన్న హెల్మెట్, మాస్క్ తీసేశారు. కొద్ది సేపు వారితో సరదాగా మాట్లాడారు. తర్వాత వారితో ఫొటోలు దిగారు. ప్రస్తుతం అజిత్ తన ఫ్యాన్స్‌పై వేసిన సెటైర్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో స్పందిస్తున్న ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత తమ హీరో గొంతు వినటం పండుగలా ఉందని అంటున్నారు. అజిత్ మంచి తనంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరి, అజిత్ తన ఫ్యాన్స్‌పై వేసిన సెటైర్లకు సంబంధించిన వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Thala voice semma goosebumps vera level weekend celebration thala video oda enjoy pannuga thala fans #Ajithkumar𓃵 #AK61 pic.twitter.com/saVEmJtXYf
— Joe Selva (@joe_selva1) September 16, 2022