ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాన్ ఇండియా సినిమాలు RRR, KGF-2. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ రూ. 1000కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఇప్పటికీ ఈ రెండు సినిమాలు విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతూనే ఉన్నాయి. అయితే.. ఈ రెండు సినిమాలు థియేటర్లలో రన్ అవుతుండగానే వీటికి సంబంధించిన ఒరిజినల్ HD ప్రింట్స్ ఆన్ లైన్ లో లీక్ అయ్యాయని షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది.
ప్రస్తుతం RRR, KGF-2 చిత్రాల మేకర్స్ తో పాటు ఆయా సినిమాల ఫ్యాన్స్ కూడా పైరసీ విషయంలో కంగారు పడుతున్నారు. ట్రిపుల్ ఆర్ మూవీని రాజమౌళి తెరకెక్కించగా, కేజీఎఫ్-2ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. ఇప్పటికే చిత్రబృందాలు సినిమాలు OTTలో రిలీజ్ అవ్వకముందే ఎలా లీక్ అయ్యాయంటూ కారణాలను ఆరా తీస్తున్నారు. అయితే.. ఈ రెండు సినిమాల HD ప్రింట్స్ టెలిగ్రామ్ గ్రూపులలో, పలు టోరెంట్స్ లో లీక్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ లీకైన రెండు ప్రింట్స్ కూడా తమిళ వెర్షన్ కి సంబంధించినవిగా సమాచారం.
థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలకు సంబంధించి పైరసీ లీక్స్ పరంగా ఎన్నిసార్లు జాగ్రత్తపడినా, ఎంత కఠినమైన చర్యలు తీసుకున్నా ఇంకా ఇలాంటివి జరుగుతుండటం గమనార్హం. తమిళనాడుకు చెందిన టొరెంట్స్ లో ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ సినిమాలు ఒరిజినల్ ప్రింట్స్ దర్శనమివ్వడం అటు మేకర్స్ కి, ఫ్యాన్స్ కి బాధకలిగించే విషయం. రెండూ కూడా పాన్ ఇండియా సినిమాలు.. అందులోనూ ఇంకా థియేటర్లలో రన్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలా జరగడం సరైందేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.