జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయినటువంటి కమెడియన్స్ లో ఇమ్మానుయేల్ ఒకరు. జబర్దస్త్ లో లేడీ కమెడియన్ వర్షతో స్కిట్స్ చేస్తూ అలరిస్తున్నాడు. అలాగే వర్షకి జంటగా కనిపించి, సొంత టాలెంట్ తో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే.. జబర్దస్త్ మాత్రమే కాకుండా ఎంటర్టైన్ మెంట్ కి సంబంధించి అన్ని టీవీ షోలలో సందడి చేస్తుంటాడు ఇమ్మానుయేల్. తాజాగా శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘జాతిరత్నాలు’ స్టాండప్ కామెడీ షోలో కనిపించాడు..!
ఇక జాతిరత్నాలు షోకి సంబంధించి తాజాగా ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో అందరూ ఎవరి స్కిట్స్ తో వారు కామెడీ పండించినప్పటికీ, ఓ లేడీ ఫ్యాన్ ఇమ్మానుయేల్ కి మ్యారేజ్ ప్రపోజల్ చేయడమే హైలైట్ గా నిలిచింది. అయితే.. ప్రోమోలో చూసినట్లయితే.. ‘ఆకాశంలో వెళ్తుంది రాకెట్టు, నీకోసం నా లైఫ్ ని పెడతా తాకట్టు’ అని ప్రపోజ్ చేసింది అమ్మాయి.
ఆమె మాటలు విని ఇమ్మానుయేల్.. పెళ్లి చేసుకుంటానంటే చెప్పు? అని అడిగాడు. దానికి ఆ అమ్మాయి.. చేసుకుంటానని చెప్పి స్టేజిపైకి వచ్చింది. అనంతరం ఇమ్ముతో పెళ్లి నీకు ఓకేనా? అని శ్రీముఖి అడగడంతో ప్రోమో ముగిసింది. అయితే.. ప్రస్తుతం వర్ష లేకుండా వేరే అమ్మాయి ఇమ్ముకి ప్రపోజ్ చేయడంతో వీడియో వైరల్ గా మారింది. మరి లైవ్ లో ఇమ్మానుయేల్ కి పెళ్లి ప్రపోజల్ రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.