వాలంటీర్ కథాంశంతో వెబ్ సిరీస్ వస్తోంది. ఇందులో వాలంటీర్ గా జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు.
జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా ఎంతో మంది కమెడియన్స్ మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్స్ గా ఎదిగారు. కమెడియన్స్ గానే కాకుండా డైరెక్టర్స్, రైటర్స్, హీరోలుగా కూడా సత్తా చాటుతున్నారు. జబర్దస్త్ షో లో చేస్తూ.. చాలా మంది సినిమాల్లో సక్సెస్ అయ్యారు. అందులో వేణు ఒకరు. ‘బలగం’ సినిమా తీసి సంచలనం సృష్టించారు. కేవలం కామెడీ పాత్రలు చేసే వేణు.. సినిమాకి దర్శకత్వం చేశారంటే చాలా మంది ఆశ్చర్యపోయారు. మరో కమెడియన్ సుధీర్ కూడా తన కామెడీతో చాలా మందిని నవ్విస్తుంటారు. పలు షోలకి యాంకర్‌గా కూడా చేశారు. సుధీర్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. హీరోగా పలు సినిమాలు చేసి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా అటు పెద్ద తెర మీద, తెర వెనుక సత్తా చాటుతూనే బుల్లితెర మీద కూడా దూసుకుపోతున్నారు. తాజాగా మరో కమెడియన్ కూడా హీరోగా రాబోతున్నారు.
అతడే జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యుయేల్. తన కామెడీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఇమ్మాన్యుయేల్ ఓ ప్రేమ కథతో మన ముందుకు వస్తున్నారు. ‘ప్రేమ వాలంటీర్’ అనే వెబ్ సిరీస్‌తో సినీ జనాలను అలరించనున్నాడు. మరో విచిత్రం ఏంటంటే ఈ వెబ్ సిరీస్‌కి జబర్దస్త్ ఫేమ్ బాబు రచన, దర్శకత్వం చేశారు. ఇక ఈ వెబ్ సిరీస్‌కి సంబంధించిన ట్రైలర్‌ను ఇమ్మాన్యుయేల్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశారు. ట్రైలర్‌కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో ఇమ్మాన్యుయేల్ గ్రామ వాలంటీర్‌గా కనిపించబోతున్నట్లు ట్రైలర్లో తెలుస్తుంది. తన ప్రియురాలిని ప్రేమలో పడేసే వాలంటీర్‌గా కనిపించనున్నారు.
ఇందులో కూడా తనదైన కామెడీ పంచులు ఉంటాయని అర్ధమవుతోంది. ఇక నటీనటుల విషయానికి వస్తే.. మహేష్, జయరాం, దివాకర్, అనూష, హేమంత్, తదితరులు నటిస్తున్నారు. కాగా ఈ వెబ్ సిరీస్‌తో ఇమ్మాన్యుయేల్ ఎలాంటి విజయం అందుకుంటారో చూడాలి. జబర్దస్త్ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఈ షో ద్వారా ఎంతో మంది యాక్టర్స్ సొంత కార్లు, సొంత ఇల్లు , కొనుకున్నారు. బుల్లితెర షోస్ లో ఒకటి జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మరి రానున్న రోజుల్లో ఈ షోలో ఉన్న కామెడియన్స్ ఎంత మంది హీరోలు అవుతారో, ఎంత మంది డైరెక్టర్లు అవుతారో చూడాలి. ఇమ్మాన్యుయేల్ హీరోగా వస్తుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.