సాధారణంగా ఇప్పుడు ప్రేక్షకులు వెబ్ సిరీస్ లను కూడా బాగానే ఇష్పటపడుతున్నారు. కానీ, తెలుగు నుంచి మాత్రం సరైన కంటెంట్ తో వెబ్ సిరీస్ లు అంతగా లేవనే చెప్పాలి. కానీ, సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్ మాత్రం ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది.
ఓటీటీలు వచ్చిన తర్వాత అందరూ సినిమాలు మాత్రమే కాకుండా.. వెబ్ సిరీస్ లు కూడా చూస్తున్నారు. అయితే సినిమాలు అంటే తెలుగులో చాలానే ఉంటాయి. కానీ, వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే మాత్రం తెలుగుకి సంబంధించి వెబ్ సిరీస్ లకు అంత క్రేజ్ లేదు. కానీ, ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులను ఎంతగానే నవ్విస్తోంది, ఆలోజింప చేస్తోంది, ఏడిపిస్తోంది కూడా. ఆ వెబ్ సిరీసే తేజ కాకుమాను దర్శకత్వం వహించిన ‘సేవ్ ది టైగర్స్’. ఈ వెబ్ సిరీస్ కి కథను ప్రదీప్ అద్వైతం, మహి వీ రాఘవ్ అందించారు. ఒక ముగ్గురు ఫ్రస్ట్రేటెడ్ భర్తల జీవితం, కెరీర్, భార్యలతో వారు పడే ఇబ్బందులు వంటి ఆసక్తికర అంశాలను ఈ వెబ్ సిరీస్ లో చూపించారు. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ వెహ్ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది.
ఇందులో ప్రియదర్శి, అభినవ్ గౌతమ్, చైతన్య కృష్ణా లీడ్ రోల్స్ ప్లే చేశారు. వారికి భార్యలుగా జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని శర్మ నటించారు. హర్షవర్దన్, సునైనా బాదం, రోహిణి ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. సద్దాం, గంగవ్వ వంటి వారు చిన్న చిన్న పాత్రల్లో అలరిస్తారు. ఈ వెబ్ సిరీస్ మొత్తం సగటు తెలుగు ప్రేక్షకుడిగి.. ముఖ్యంగా సగటు భర్తకు బాగా కనెక్ట్ అవుతుంది. భార్యలు చూపించే ప్రేమ, ముందుచూపుని తెలియజేస్తూనే.. దాని వల్ల భర్తలు ఎలా ఇబ్బంది పడతారు? భార్యలకు చెప్పుకోలేక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు అనే అంశాలను చూపించారు. ఈ వెబ్ సిరీస్ చూస్తున్నంత సేపు మీకు నిజ జీవితంలో జరిగిన ఘటనలు, మీ రియల్ లైఫ్ లో ఉండే వ్యక్తులు పాత్రలుగా కనిపిస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.
ఎంతో ఎమోషనల్ సీన్ లో కూడా మిమ్మల్ని నవ్వించారు. మరోవైపు భర్తలు లైఫ్ ని ఎలా లీడ్ చేస్తారు? సమాజం- ఆఫీస్- తల్లి- భార్య- అత్త- పిల్లలు- బాధ్యతలు వంటి అంశాలను ఎలా మేనేజ్ చేస్తారు? అనే విషయాలను చూపించారు. ముఖ్యంగా ఒక భర్త తన లైఫ్ లో ఎదుర్కొనే ఎన్నో సున్నితమైన సమస్యలను ఎంతో చక్కగా తెరకెక్కించారు. మీరు ఫస్ట్ ఎపిసోడ్ చూడటం స్టార్ట్ చేస్తే కచ్చితంగా సిరీస్ మొత్తం చూసేస్తారు. ఈ సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ లో ఫన్- ఫ్రస్ట్రేషన్- ఎమోషన్- మెసేజ్ అన్నీ ఉన్నాయి. అలాగే రెండో సీజన్ కోసం ఒక బిగ్ ట్విస్ట్ ఇచ్చి కట్ చేశారు.