మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ హీరో హీరోయిన్లుగా డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి రూపొందించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘గని’. ఎంతో ప్రతిష్టాత్మకంగా సిద్దు ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమన్ అందించిన ఈ సినిమాపై మెగాఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ మొదటి రోజు ఈ సినిమాకి మిక్సెడ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ పై ప్రభావం పడిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
గని ఫస్ట్ డే కలెక్షన్స్:
నైజాం – 75 లక్షలు
సీడెడ్ – 30 లక్షలు
ఉత్తరాంధ్ర – 40 లక్షలు
ఈస్ట్ – 19 లక్షలు
వెస్ట్ – 14 లక్షలు
గుంటూరు – 17 లక్షలు
కృష్ణా – 16 లక్షలు
నెల్లూరు – 11 లక్షలు
ఏపీ + తెలంగాణ (టోటల్) – 2.24 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 30 లక్షలు
ఓవర్సీస్ – 20 లక్షలు
వరల్డ్ వైడ్ (టోటల్) – 2.72 కోట్లు (గ్రాస్ 5 కోట్లు)
ఈ సినిమాకు మొత్తంగా రూ. 25.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో బ్రేక్ ఈవెన్ కు రూ.27 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు మిక్సెడ్ టాక్ రావడంతో ఆశించిన స్థాయిలో వసూల్ చేయలేకపోయిందని సమాచారం. మొదటి రోజు ‘గని’ రూ. 2.72 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ. 24.48 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. మరి గని సినిమాపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి.