జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన RRR చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. వరుసగా ఐదో రోజు కూడా భారీ కలెక్షన్లు సాధిస్తూ.. ఆల్ టైం రికార్డు క్రియేట్ చేస్తుంది. ఇక సినిమాపై, ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొందరు ఎన్టీఆర్ అభిమానులు మాత్రం సినిమాలో తమ అభిమాన హీరోకు తగిన ప్రాధాన్యం దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్‌నే ఎక్కవ హైలెట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు కూడా చేశారు.
అయితే ఈ వీరాభిమానుల వల్ల.. హీరోలకు ఎలాంటి నష్టం వాటిల్లుతుందో, వారు ఎంత ఇబ్బంది పడతారో తెలిపారు ప్రముఖ ప్రవచనకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావు. ఆయన గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుత RRR సినిమా విడుదల తర్వాత మరోసారి వైరలవుతున్నాయి.
ఇది కూడా చదవండి: క్షమాపణలు చెప్పిన గరికపాటి.. ఆ వీడియో వైరలవ్వడంతో..!ఈ ప్రవచనంలో గరికపాటి హీరోలు, వారి అభిమానులు గురించి ప్రస్తావించారు. కళాకారులు, క్రీడాకారులు గురించి చర్చ జరిగినప్పుడు గరికపాటి జూనియర్ ఎన్టీఆర్ పేరును సూచిస్తూ మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. పేరు ప్రతిష్టలు ఉన్నవారు స్పష్టంగా లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు. అభిమానుల ఆశల మేరకు కళాకారులు బ్రతకాలా!. జూనియర్ ఎన్టీఆర్ అనుభవిస్తున్న అవస్థ, సచిన్ టెండూల్కర్ అనుభవిస్తున్న అవస్థ గురించి మోహమాటం లేకుండా చెబుతున్నాను. అభిమానులు తమ అంచనాల ప్రకారమే హీరోలు ఉండాలని కోరుకుంటారు. తమ అభిమాన నటుడు హీరో వేషమే వేయాలని అనుకుంటారు. ఏం ఓ గుమాస్తా వేషం వేయకూడదా.. ఓ విలన్ వేషం వేయకూడదా! వాళ్లలోని నటుడిని బయటకు రానీయరా. క్రికెట్‌లో ఎవరైనా ఓడిపోతే పెద్ద బాధ. వాడి కోసం మనం ఆత్మహత్య చేసుకుంటాం. టెండూల్కర్‌కి వేలు నొప్పి పెడితే ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తాం. వాళ్లలాగా తయారవుదామని ఉండదు. ఆటను, కళను యుద్ధంగా తీసుకుంటున్నాం’’ అన్నారు గరికపాటి.
ఇది కూడా చదవండి: Jr.ఎన్టీఆర్ మెగా ఫ్యామిలీ హీరోగా మారిపోయాడా?
‘‘ఆటన్నాక ఓ సారి గెలుస్తాం.. ఓసారి ఓడిపోతాం. కళాకారులు, క్రీడాకారులపై ఒత్తిడి పెంచకూడదు. ఈ అభిమానులు అత్యుత్సాహం కారణంగా హీరోలు ఒత్తిడికి లోనవుతారు. ఓ సినిమా విజయం సాధించగానే ఇక తమ హీరో అలాగే ఉండాలని అభిమానులు గొడవ చేస్తారు. ఫ్యాన్స్ అంచనాల మేరకు హీరో ఉండాలి. నటుడిని ఎదగనివ్వరు. సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరరావు, ఎస్.వి.రంగారవు తరాన్ని గమనిస్తే.. కారు డ్రైవర్ పాత్ర నుంచి కర్మాగారం అధినేత పాత్ర వరకు అన్నీ పాత్రలు వేశారు. దేనికీ అవమానపడలేదు. దర్శకుడు చెప్పినట్లు నటుడు వినాలంతే. కళాకారులు, క్రీడాకారులు ఎలా ఉండాలనే దాని మీద అభిమానులు ఒత్తిడి పెంచకూడదు’’ అని తెలిపారు గరికిపాటి. RRR విడుదల తర్వాత విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: రామ్ చరణ్ పుట్టినరోజు.. రాజమౌళి, ఎన్టీఆర్ హంగామా.. వీడియో వైరల్