ఈ మధ్యకాలంలో టాలెంట్ ఉన్నవారు సెలబ్రిటీలు అయ్యేందుకు సోషల్ మీడియా ఏ స్థాయిలో ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ రంగంలో ప్రావీణ్యం ఉన్నా, చేసేపనిలో కాస్త కొత్తదనం కనిపిస్తే చాలు.. తగిన ప్రోత్సాహంతో పాటు నెటిజన్స్ సపోర్ట్ సంపాదించుకోగలిగితే వారు సెలబ్రిటీలే. ఎందుకంటే.. సోషల్ మీడియా లేని సమయంలో ఎంతోమంది టాలెంట్ ఉన్నవారు బయట ప్రపంచానికి తెలియకుండానే ప్రయత్నాలు చేసి కనుమరుగైపోయారు. అయితే.. అలాంటి వారు సోషల్ మీడియా వచ్చాక ప్రూవ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి స్థాయికి చేరుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు.
ఇక ఎన్నో ఏళ్లుగా డ్యాన్స్ లో ఎదగాలని ప్రయత్నాలు చేసి.. దాదాపు 11 ఏళ్ళ తర్వాత గుర్తింపు పొందిన వారిలో గాజువాక కండక్టర్ ఝాన్సీ ఒకరు. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజిపై ఆమె చేసిన ‘పల్సర్ బండి’ సాంగ్ మాస్ పెర్ఫార్మన్స్ తో ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఝాన్సీ పేరు వినిపించడమేగాక, ఆమె డ్యాన్స్ పెర్ఫార్మన్సులే కనిపిస్తుంటడం విశేషం. పెళ్లి కాకముందు నుండే డ్యాన్స్ లో తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నించిన ఝాన్సీకి, పెళ్లి జరిగి.. బస్ కండక్టర్ గా జాబ్ చేసుకుంటున్న టైంలో గుర్తింపు రావడం అనేది ఆలస్యంగా జరిగిందని చెప్పాలి.
ఈ క్రమంలో ఝాన్సీ పల్సర్ బండి పెర్ఫార్మన్స్ తో పాటు కొత్తగా ఆమె ఇంటర్వ్యూలు చూస్తున్న వారంతా.. ఆమె పార్టిసిపేట్ చేసిన పాత టీవీ షోలను తిరగేస్తున్నారు. అయితే.. అప్పుడెప్పుడో 2011లో వచ్చిన ‘తీన్మార్’ డ్యాన్స్ షోలో డ్యాన్సర్ మొయిన్ తో కలిసి పెర్ఫర్మ్ చేసింది ఝాన్సీ. ఇప్పుడు గతంలో మొయిన్ తో కలిసి డాన్స్ చేసిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అలాగే జెమినీలో డ్యాన్సింగ్ స్టార్(విన్నర్), మాటీవీలో ‘రంగం 2’ ఇలా అన్ని టీవీ షోలలో తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది ఝాన్సీ. సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు అందరూ ఝాన్సీ టాలెంట్ ని, హార్డ్ వర్క్ ని గుర్తిస్తున్నారు. కానీ.. పదేళ్ల ముందే మొదలైన ఝాన్సీ కష్టానికి ఇప్పుడిప్పుడు ప్రతిఫలం అందుకుంటోంది. ఇక ఇంటర్ పూర్తయిన వెంటనే ప్రేమించి పెళ్లి చేసుకుంది ఝాన్సీ.
ఝాన్సీ పార్టిసిపేట్ చేసే ప్రతి పనిలో, పెర్ఫార్మన్స్ లో ఆమె భర్త ప్రోత్సాహం ఎంతో ఉందని చెప్పింది. అలాగే ఝాన్సీ పెర్ఫార్మన్స్ లలో ఆమె భర్త సపోర్టింగ్ డ్యాన్సర్ గా పెర్ఫర్మ్ చేస్తుంటాడని.. అతని సహకారం, ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి ఎదిగినట్లు రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపింది కండక్టర్ ఝాన్సీ. ఈ విధంగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ద్వారా సెలబ్రిటీ హోదా అందుకున్న ఝాన్సీకి.. ఈరోజుల్లో కూడా సోషల్ మీడియా ఇంత లేకపోతే ఓ సాధారణ బస్ కండక్టర్ గా, టాలెంట్ ఉండి తగిన ప్రోత్సాహము, గుర్తింపు లేని డాన్సర్ గా మిగిలిపోయేది. మరి ప్రస్తుతం ట్రెండ్ సృష్టిస్తున్న గాజువాక కండక్టర్, డాన్సర్ ఝాన్సీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.