సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలకు పాపులారిటీతో పెళ్లి వయసు వచ్చిందంటే చాలు.. ఇక పెళ్ళెప్పుడు అనే ప్రశ్నలు అటు ఫ్యాన్స్ నుండి, ఇటు ప్రేక్షకుల నుండి సోషల్ మీడియాలో వెల్లువెత్తుతూనే ఉంటాయి. ఈ జాబితాలో టీవీ యాంకర్లు మినహాయింపు కాదు. కొంతకాలంగా ఇదే ప్రశ్నను ఎదుర్కొంటోంది పాపులర్ టీవీ యాంకర్, నటి శ్రీముఖి. ఈ భామ ఓవైపు టీవీ షోలు చేస్తూనే మరోవైపు సినిమాలలో నటిస్తోంది.
ఇటీవలే ఓ టీవీ షోలో పాల్గొన్న శ్రీముఖి.. ఇదివరకే బిగ్ బాస్ లో పెళ్లి పై స్పందించి తన లవ్ స్టోరీని చెప్పిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయినప్పటికీ.. ఎంతోమంది అందమైన హీరోలు, కో యాక్టర్ లతో వర్క్ చేసినప్పటికీ.. శ్రీముఖి ఎందుకు పెళ్లి చేసుకోలేదా అనే సందేహాలు ఫ్యాన్స్ లో ఉన్నాయి. కానీ ఈ ప్రశ్నలన్నింటికి త్వరలోనే సమాధానం చెబుతుందనే నమ్మకం అందరిలో ఉంది.
ఈ క్రమంలో ప్రస్తుతం శ్రీముఖి జాతిరత్నాలు అనే టీవీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం విదితమే. ఈ షోకి సంబంధించి తాజాగా ఓ ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. ప్రోమో అంతా సరదాగానే సాగింది. కానీ మధ్యలో ఓ కొత్త కమెడియన్ శ్రీముఖి పెళ్లిపై ఫన్నీ కామెంట్ చేశాడు. నా పెళ్ళెప్పుడు అవుతుందో చెప్పు అంటూ అడిగిన శ్రీముఖికి.. ‘తిన్న ఇస్తరాకును కడిగి వాడటం, నూకరాజు తెల్లగా మారడం, నీకు పెళ్లవడం.. జన్మలో జరగవు” అంటూ కామెంట్ చేసాడు. ఈ కామెంట్ వినగానే శ్రీముఖి షాక్ కి గురైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి శ్రీముఖి పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.