ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో యువ దర్శకులు జోరు బాగా పెరిగిపోయింది. మంచి కంటెంట్ ఉంటే ఎలాంటి చిత్రమైనా ప్రేక్షకులు ఆదరిస్తారని తెలిసిందే. ఈ నేపథ్యంలో రొటీన్‌కు భిన్నంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ దర్శకుడి లేటెస్ట్ మూవీ ‘హనుమాన్’. పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరో క్యారెక్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న మూవీ ఇది.
తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా రేంజ్ సినిమాలు ఈ మధ్య కాలంలో ఎన్నో వచ్చాయి. ఇది ఇండియాలోనే మొట్టమొదటి రియల్ సూపర్ హీరోకు సంబంధించిన పాన్ ఇండియా సినిమా. అంజనాద్రి ప్రపంచంలోకి ప్రయాణం.. హను – మాన్ నుంచి హనుమంతుని పరిచయం చేస్తున్నట్టు ప్రకటించాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్టేట్‌ను శనివారం విడుదల చేశారు మూవీ మేకర్స్. శుక్రవారం ఫస్ట్ లుక్ పోస్ట్ రిలీజ్ చేసిన దర్శకుడు.. ఈ రోజు (శనివారం) మరో అప్ డేట్ తో ముందుకొచ్చాడు. కే నిరంజన్ రెడ్డి నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తేజా సజ్జా హీరోగా చేస్తున్నారు.
ఇప్పటికే ప్రశాంత్ వర్మ-తేజ్ సజ్జా కాంబినేషన్ లో ’జాంబీ రెడ్డి’ బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది. ఈ మూవీలో కామెడీ ఓ రేంజ్‌లో పేలింది. ఈ సినిమా థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన అందులోనే కామెడీ కూడా వర్కవుట్ చేయడంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఫస్ట్ మూవీ ‘అ’ తోనే అందర్నీ ఆకట్టుకుని జాతీయ అవార్డు అందుకున్న ప్రశాంత్ వర్మ తర్వాత రాజశేఖర్ హీరోగా ‘ కల్కి’ వచ్చినా పెద్దగా అలరించలేకపోయాడు. అయినప్పటికీ ‘కల్కి’ మూవీ టేకింగ్ కి మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం తమన్నా హీరోయిన్‌గా రూపొందించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక, ఈ వీడియోతో ‘హనుమాన్’ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి.
Here it is.. 😊
Introducing @tejasajja123 as #Hanumanthu from the world of #Anjanadri🏔
Launched by @dulQuer💥
HANU🔶MAN
The First Pan-India SuperHero Film#HanuMan @Niran_Reddy @Primeshowtweets— Prasanth Varma (@PrasanthVarma) September 18, 2021