తేజ సజ్జ.. చైల్డ్ ఆర్టిస్ట్ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించాడు. జాంబిరెడ్డి మూవీతో హీరోగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే హీరోగా హిట్టు కొట్టేశాడు. జాంబిరెడ్డితో ప్రశాంత్ వర్మ గ్రాఫ్ కూడా బాగా పెరిగింది. తర్వాత తేజ సజ్జతోనే అద్భుతం అనే సినిమా కూడా తీశాడు. ఇప్పుడు వీళ్ల కాంబోలో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. పైగా ‘హనుమాన్’ సినిమాతో తేజ సజ్జ పాన్ ఇండియా హీరో కాబోతున్నాడు. ఈ సినిమాని కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్‌ని విడుదల చేశారు.
హనుమాన్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ టీజర్ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. టేకింగ్, సినిటోగ్రఫీ అద్భుతంగా ఉంది. అయితే చాలా మంది ఈ టీజర్ చూసిన తర్వాత ఆదిపురుష్ సినిమా గురించి మాట్లాడుతున్నారు. అన్ని కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమా కంటే గ్రాఫిక్స్, విజువల్స్ హనుమాన్ సినిమాలోనే ఎంతో అద్భుతంగా ఉన్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆదిపురుష్ టీజర్ విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి నెగెటివ్ రివ్యూస్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఓంరౌత్ దిద్దుబాటు చర్యలు కూడా ప్రారంభించాడు. అయితే హనుమాన్ టీజర్‌కు మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.