ప్రస్తుతం పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా ఓ సూపర్ హీరో సినిమా గురింతి చిత్ర బృందం క్రేజీ అప్డేట్ ఇచ్చారు. తేజ సజ్జ- అమృతా అయ్యర్ జంటగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సూపర్ హీరో చిత్రం హునుమాన్. ఈ సినిమా 100 రోజుల షూటింగ్ పూర్తి చేసుకుందంట. ఇంకా కొంత మాత్రమే షూటింగ్ మిగిలుందని తెలిపారు. ఈ సందర్భంగా దర్శక- నిర్మాతలు మీడియాతో మాట్లాడారు.
ఇదీ చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!
‘హనుమాన్ చిత్రం.. మొదటి పాన్ ఇండియా సూపర్ హీరో చిత్రం. హనుమాన్ సినిమా షూటింగ్ పూర్తి కావస్తోంది. అన్ని సూపర్ హీరో సినిమాల్లోలానే.. ఈ చిత్రంలోనూ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. డూప్ లేకుండా అన్ని యాక్షన్ సీన్లను హీరో తేజానే స్వయంగా చేస్తున్నాడు. రోజూ దాదాపు 8 గంటల పాటు తేజ రోప్ పైనే ఉండాల్సి వస్తోంది. మొదటి పాన్ ఇండియా సూపర్ హీరో చిత్రం ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో వరలక్ష్మి కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన హనుమాన్ టీజర్ కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. హీరోగా తేజ సజ్జ స్పీడ్ పెంచేశాడు. హనుమాన్ సినిమా ఎలా ఉండబోతోంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.