ఈ మధ్యకాలంలో సినిమాల రిలీజుల విషయంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రోజురోజుకూ తెరకెక్కుతున్న సినిమాల సంఖ్య పెరుగుతుండటంతో రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి క్లాష్ జరుగుతోంది. పెద్ద సినిమాలైనా, చిన్న సినిమాలైనా బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ వస్తే.. కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఏమాత్రం టాక్ అటు ఇటు అయినా.. ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చెప్పక్కర్లేదు. సినిమాల విషయంలో ప్రేక్షకులు కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. స్టార్ హీరో, కాస్ట్ అని కాకుండా కంటెంట్ ప్రధానంగా సినిమాలను ఆదరిస్తున్నారు. గత కొన్నాళ్లుగా చూసుకుంటే.. కంటెంట్ కొత్తగా ఉన్న సినిమాలే బాక్సాఫీస్ వద్ద ఆడుతున్నాయి.
ఈ క్రమంలో ఇదివరకు వారానికి ఒకటి లేదా రెండు సినిమాలు రిలీజ్ అవుతుండేవి. కానీ.. ఇప్పుడా వరస మారిపోయింది. బడ్జెట్.. రిలీజ్ లేట్ అవుతున్నకొద్దీ పెరిగే ఖర్చులను దృష్టిలో పెట్టుకొని సినిమాలను పోటీపడి మరీ రిలీజ్ చేసేస్తున్నారు. 2023 ఏడాదిని జనవరిలో విడుదలైన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, డబ్బింగ్ చిత్రంగా వచ్చిన పఠాన్ సినిమాలు గ్రాండ్ గా స్టార్ట్ చేశాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో సందడి చేసేందుకు చాలా సినిమాలు రెడీ అయిపోయాయి. బిగ్ స్టార్స్ మూవీస్ లేనప్పటికీ.. మినిమమ్ అంచనాలు క్రియేట్ చేసిన మీడియం సినిమాలు, చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఫిబ్రవరిలో బాక్సాఫీస్ వద్ద పోటీపడనున్న సినిమాలేంటో చూద్దాం!