సావిత్రక్క అలియాస్ శివజ్యోతి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. మనలానే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. స్వయంకృషితో ఎదిగి.. తనకంటూ ఒక అధ్యాయాన్ని రాసుకుంది. తీన్మార్ ప్రోగ్రాంతో సావిత్రిగా తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆదరణ దక్కించుకుంది. బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయ్యింది. అయితే బిగ్ బాస్ షోకి వెళ్ళక ముందు వరకూ గ్లామర్ అనే పదానికి దూరంగా ఉంటూ వచ్చిన శివజ్యోతి.. ఎప్పుడైతే బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టిందో అప్పుడే గ్లామర్ అనే పదాన్ని తన డిక్షనరీలో చేర్చుకుంది. బిగ్ బాస్ షో నుంచి గ్లామర్ క్వీన్ గా కూడా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తుంది.
అలా అని ఎప్పుడూ మితిమీరిన గ్లామర్ షో చేయలేదు. కానీ తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. వాటిని చూసిన ఆమె అభిమానులు గ్లామర్ షో ఎక్కువైందంటూ కామెంట్స్ చేస్తున్నారు. పల్లెటూరు అమ్మాయిలా, మన ఇంటి పక్కన అమ్మాయిలా.. మన ఇంట్లో అమ్మాయిలా కనిపించే శివజ్యోతి.. ఇప్పుడు ఇలా గ్లామర్ షోలో దర్శనమిస్తుంటే ఆమె తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. సావిత్రక్కగా అందరికి రిజిస్టర్ అయిపోయిన శివజ్యోతిని తమ ఇంట్లో ఒకరిలా చూసుకుంటున్నారు. తమ అక్కగా, చెల్లెలిగా భావిస్తున్నారు. అందుకే గ్లామర్ షో చేయవద్దంటూ ఆమెను రిక్వెస్ట్ చేస్తున్నారు.
తాజాగా ఆమె మోడ్రన్ దుస్తుల్లో దిగిన ఫోటోలపై ఆమె అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నెత్తిన గొడుగు పెట్టుకుని.. పొదుపుగా వేసుకున్న దుస్తుల్లో కొన్ని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలని చూసి ఆమె అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నువ్వు కూడా ఎక్స్పోజింగ్ లోకి వెళ్లిపోయావా అంటూ ఒకరు కామెంట్ చేయగా.. అంతకు మించి ఎక్స్పోజ్ చేయకు సావిత్రి అక్క అంటూ మరొకరు కామెంట్ చేశారు. సెలబ్రిటీ అయినప్పటికీ సాధారణ యువతిలా కనిపించే శివజ్యోతి.. ఇలా కనిపించేసరికి ఫ్యాన్స్ ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. మరి మన ఇంట్లో అమ్మాయిలా కనిపించి శివజ్యోతి గ్లామర్ షో చేయడంపై.. అలానే గ్లామర్ షో చేయవద్దు అంటున్న ఆమె అభిమానులపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.