గాన కోకిల లతా మంగేష్కర్ కన్ను మూసిన సంగతి తెలిసిందే. కోవిడ్ బారిన పడిన ఆమె.. ఫిబ్రవరి 6న తుది శ్వాస విడిచారు. అభిమానులు లత మరణ వార్తను ఇంకా జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో లత జన్మించిన మధ్యప్రదేశ్ ఇండోర్ లోని సిక్ మొహల్లా వీధి ప్రాంతానికి ఆమె పేరు పెట్టాలని అభిమానులు నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
1929లో ఈ ప్రాంతంలోనే లతా మంగేష్కర్ జన్మించారు. ఆమె పుట్టిన ప్రాంతంలో ప్రస్తుతం ఓ వస్త్రాల దుకాణం నడుపుతున్నారు. లత మరణించారు అనే వార్త తెలిసిన వెంటనే అభిమానులు పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో గుమి కూడారు. స్థానిక జిల్లా కోర్టుకు ఆనుకుని ఉన్నా ఈ వీధిని ప్రస్తుతం ‘కోర్టు వాలీ గల్లీ’గా పిలుస్తుండగా.. ఇక్కడ స్నాక్స్ దుకాణాలు కూడా ఉండటంతో కొందరు.. ‘చాట్ వాలీ గల్లీ’ అని కూడా పిలుస్తుంటారు. ఈ ప్రాంతానికి లతా మంగేష్కర్ పేరు పెట్టాలని ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తుంది. ఆమె మరణం తర్వాత ఈ ప్రతిపాదనకు డిమాండ్ భారీగా పెరిగింది.
ఇది కూడా చదవండి : వైరల్ అవుతున్న లతా మంగేష్కర్, ప్రధాని మోదీ ఫోన్ కాల్ సంభాషణ
లతా మంగేష్కర్ తండ్రి దీనానాథ్ మంగేష్కర్ ఓ డ్రామా బృందాన్ని నడిపేవారు. వివిధ నగరాల్లో పర్యటిస్తూ.. నాటకాలు ప్రదర్శించేవారు. అలా వారు ఇండోర్ కు చేరుకున్న సమయంలో లత జన్మించారు. ఆమె పుట్టిన కొద్ది కాలానికి ఆ కుటుంబం ఇండోర్ ను వదిలి వెళ్లింది. ఆ తర్వాత లత జన్మించిన ఇంటిని కూల్చేసి అక్కడ ఓ బట్టల దుకాణం ప్రారంభించారు. దాని యజమాని లత మీద అభిమానంతో… ఆమె ఫోటోను తన దుకాణంలో పెట్టుకున్నాడు. అభిమానుల డిమాండ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి : లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోసుకోకపోవడానికి కారణమిదే…!