లవర్స్ కోసం స్పెషల్ కేఫ్. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ప్రేమికులు ప్రైవేట్ క్షణాలను గడిపేందుకు ఈ దీనిని రూపొందించారు నిర్వాహకులు. గంటకు కేవలం రూ.99 మాత్రమేనట. అసలు విషయం ఏంటంటే?
ప్రేమలో ఉన్న యువతి, యువకులు ఏకాంతంగా గడిపేందుకు పార్కులకు వెళ్తుంటారు. అక్కడ సేద తీరుతు మనసులోని భావాలను పంచుకుంటూ ముద్దు, ముచ్చట్లు తీర్చుకుంటుంటారు. ఇక మారిన కాలానికి అనుగుణంగా ఈ మధ్యకాలంలో కొందరు నిర్వాహకులు ఓయో వంటి హోటల్ లను ఏర్పాటు చేశారు. కొన్ని షరతులతో ఈ హోటల్స్ ప్రేమికులకు వెల్కమ్ చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఓ నిర్వాహకుడు.. ప్రేమికులను ఆసరాగా చేసుకుని బ్లూ బాటల్ కేఫ్ పేరుతో స్పెషల్ క్యాబిన్ హౌస్ ను డిజైన్ చేశాడు. ఇటీవల దీనికి సంబంధించిన ఓ ప్రమోషన్ వీడియోను ఒకటి సోషల్ మీడియాలో విడుదల చేశాడు. అది కాస్త వైరల్ గా మారి అందరి దృష్టిని ఆకర్షించింది. అంతలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అసలు దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటంటే?
పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఛత్రిపురలో ఓ నిర్వాహకుడు బ్లూ బాటల్ కేఫ్ పేరుతో స్పెషల్ క్యాబిన్ హౌస్ ను ఏర్పాటు చేశాడు. ఇది ప్రత్యేకంగా ప్రేమికుల కోసం డిజైన్ చేసిన స్పెషల్ హౌస్. ప్రేమికులు వెళ్లి ముద్దు, ముచ్చట్లు తీర్చుకోవడానికి వెసులుబాటుగా దీనిని స్పెషల్ గా రూపొందించారు. అయితే బ్లూ బాటల్ కేఫ్ కు సంబంధించి ప్రమోషన్ కోసం ఇటీవల ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆ స్పెషల్ కేఫ్ లో ప్రేమికులు ఓ గంట గడిపేందుకు క్యాబిన్ కు అయ్యే ఖర్చు కేవలం రూ.99 మాత్రమే అంటూ వీడియోలో పొందుపరిచారు. ఆ వీడియో క్షణాల్లో కాస్త వైరల్ గా మారింది. ఇకపోతే.. ఈ వీడియోను చూసిన స్థానికులు కాస్త అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
ఇలాంటి వాటితో యువతను చెడగొట్టేందుకు కంకణం కట్టుకున్నారని స్థానికులు వాపోయారు. దీంతో పాటు ఈ సంస్థ ప్రమోషన్ వీడియో చివరికి పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ వీడియోను చూసిన పోలీసులు.. వెంటనే ఛత్రిపురలో ఉన్న బ్లూ బాటల్ కేఫ్ హౌస్ కు వెళ్లగా దానికి తాళం వేసి ఉంది. అనంతరం పోలీసులు పరారీలో ఉన్న నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రేమికులు ప్రైవేట్ క్షణాలు గడిపేందుకు వారిని ఆసరాగా చేసుకుని ఈ బ్లూ బాటల్ కేఫ్ ఏర్పాటు చేశారని పోలీసులు తెలిపారు. అనంతరం బ్లూ బాటల్ కేఫ్ నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.