ఆ పని చేయాలంటూ రాజాను అతడి భార్య రాణి వేధించసాగింది. భార్య వేధింపులు తట్టుకోలేక చాలా ఇబ్బందులకు గురయ్యాడు. ఆ తర్వాత ఓ దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు.
భార్యాభర్తల మధ్య గొడవలు రావటం సహజం. అయితే, ఆ గొడవలు కుటుంబ సమస్యల విషయంలో వస్తే పర్లేదు. కానీ, మతం గురించి వస్తే మాత్రం పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. తాజాగా, ఓ భార్యాభర్తల జంట మధ్య మతం విషయంలో గొడవ జరిగింది. తన మతంలోకి రావాలంటూ ఓ భార్య.. భర్తను వేధించసాగింది. దీంతో భర్త తట్టుకోలేకపోయాడు. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా ఠాకూర్.. రాణి అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి మతాలు వేరువేరు. ఈ నేపథ్యంలోనే రాజాను మతం మార్చుకోవాల్సిందిగా రాణి వేధిస్తూ వస్తోంది. రాజా మతం మార్చుకోనని ఎన్ని సార్లు చెప్పినా ఆమె వినలేదు. దీంతో తనకు 65 వేల రూపాయలు.. ఓ ప్లాట్ కావాలని ఆమె డిమాండ్ చేసింది. అయితే, తన దగ్గర అంత డబ్బు లేకపోవటంతో రాజా ఆలోచనల్లో పడ్డాడు. ఓ రోజు రాణిని వెంటబెట్టుకుని ఓ స్థలం చూడడానికి వెళ్లాడు. స్థలం ఆమెకు నచ్చటంతో స్థలం కొనాలని డిసైడ్ అయ్యాడు.
అయితే, స్థలం కోనే సమయం వచ్చే సరికి అతడి దగ్గర డబ్బులు లేకుండా పోయాయి. స్థలం కొనివ్వకపోవటంతో రాణి.. రాజాను వేధించసాగింది. మరో సారి మతం మారాలంటూ పట్టుబట్టింది. ఆమె వేధింపులు తాళలేకపోయిన రాజా ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు రాజా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.