దాదాపు 20 మంది దుండగులు వారిపై దాడి చేశారు. అమ్మాయి అని కూడా చూడకుండా విచక్షణా రహితంగా కత్తితో పొడిచారు. ఈ దాడిలో జంటతో పాటు వారిని కాపాడ్డానికి వచ్చిన మరో ఇద్దరూ కూడా గాయపడ్డారు.
ఇండోర్‌లో సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. హోటల్లో డిన్నర్ చేయటానికి వెళ్లిన ఓ జంటపై కొంతమంది దుండగులు దాడికి పాల్పడ్డారు. కత్తులతో విచక్షణా రహితంగా పొడిచారు. దుండగుల దాడిలో జంట తీవ్రంగా గాయపడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మధ్య ప్రదేశ్లోని ఇండోర్‌కు చెందిన ఓ యువతి, యువకుడు కొద్దిరోజుల క్రితం స్థానికంగా ఉన్న ఓ హోటల్‌కు వెళ్లారు. హోటల్‌లో డిన్నర్ చేసిన తర్వాత ఇంటికి వెళ్లటానికి బయటకు వచ్చారు.
స్కూటీ ఎక్కి వెళ్లటానికి సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో కొంతమంది వారి దగ్గరకు వచ్చారు. వారిని అడ్డగించి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేశారు. జంటతో గొడవకు దిగారు. జంట ఎంత వారిస్తున్నా వినకుండా తిట్టడం మొదలు పెట్టారు. యువకుడు ఆ గొడవను సద్దు మణిగించే ప్రయత్నం చేశాడు. అయినా వాళ్లు వినలేదు. యువడితో మరింత దురుసుగా ప్రవర్తించారు. పక్కన ఉన్నది అమ్మాయి అని తెలిసి కూడా దారుణంగా వ్యవహరించారు. ఆమెను కూడా బూతులు తిట్టారు. దాదాపు ఓ 20 మంది జంటపై దాడి చేశారు. కత్తులతో పొడిచారు.
ఈ జంటను కాపాడ్డానికి వచ్చిన వారిపై కూడా దుండగులు దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డవారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జంటకు ఆసుపత్రిలో చికిత్స అందుతోంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసుతో సంబంధం ఉన్న 20 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
In Indore, MP MusIim mobs beat a couple because the girl was a MusIim & the boy was a Hindu.
It’s becoming a new normal!
Imagine the amount of national-international outrage if any Hindu group starts doing this with M boy & H girl couples.. pic.twitter.com/Is0nis1QbJ— Mr Sinha (@MrSinha_) May 26, 2023