యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలను లైన్ లో పెట్టి కాస్త దూకుడు మీదున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR మూవీలో నటించి ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. అయితే ఈ సినిమాతో నటన పరంగా ఎన్టీఆర్ మరో మెట్టు ఎక్కాడన్నది మనందరికి తెలిసిన విషయమే. ఇదే కాకుండా RRR మూవీలో కొమురం భీముడో అంటూ సాగే పాటలో ఎన్టీఆర్ నటనపై ఇటు టాలీవుడ్ సినీ ప్రముఖులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రముఖులు సైతం ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే ఇక్కడ విషయం ఏంటంటే? తాజాగా అనంతపురంలోని జరిగిన రామ్ పోతినేని సినిమా ది వారియర్ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యఅతిధిగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను హాజరై ట్రైలర్ ను విడుదల చేశారు. అయితే ఈ సందర్భంగా ఈ వేడుకలో చాలా మంది అభిమానులు పాల్గొన్నారు. ఇందులో కొంతమంది ఫ్యాన్స్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావాలంటూ బ్యానర్లతో వచ్చారు. ఇందులో CM NTR..RRR అని రాసి ఉంది.
ఇది కూడా చదవండి:Ala Vaikunthapurramuloo Home: ‘అల వైకుంఠపురంలో’ మూవీలో కనిపించే ఇల్లు ఎవరిదంటే?
ఇక ఇంతటితో ఆగకుండా CM NTR.. CM NTR అంటూ తెగ అరిచి ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. కాగా రామ్ హీరో ఫంక్షన్ లో ఫ్యాన్స్ ఇలా చేయడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఇదే కాకుండా గతంలో అనేక చోట్ల Jr.NTR సీఎం కావాలంటూ ఆయన ఫ్యాన్స్ జెండాలతో పాటు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక తాజాగా అనంతపురంలో ఇలాంటి సీన్ మళ్లీ కనిపించడంతో తెలుగు రాజకీయాల్లో కాస్త చర్చనీయాంశమవుతోంది. Jr.NTR ముఖ్యమంత్రి కావాలంటూ ఫ్యాన్స్ చేసిన అల్లరిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.