బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ వంటి స్టార్ హీరోహీరోయిన్లతో తెరకెక్కిన చిత్రం బ్రహ్మాస్త్ర. దర్శకుడు అయాన్ ముఖర్జి మూడు పార్ట్స్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కరణ్ జోహార్, రణ్‌బీర్ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో మొదటి పార్ట్ బ్రహ్మాస్త్ర పార్ట్ వన్- శివ సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
నార్త్‌లోనే కాక దక్షిణాదిలోని అన్ని భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రం బృందం డివైడ్ అయ్యి ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాలీవుడ్‌లో ఆలియా భట్, దక్షిణాదిన రణ్‌బీర్ కపూర్, నాగార్జున బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ చూసుకుంటున్నారు. ఇక చెన్నైలో జరిగిన మీడియా సమావేశానికి దర్శకుడు రాజమౌళి అతిథిగా హాజరయ్యారు.
ఈ క్రమంలో తెలుగలో బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్‌కి సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. తెలుగలో బ్రహ్మాస్త్ర ప్రమోషన్ బాధ్యతలను తారక్ భుజాన వేసుకున్నాడట. అంతేకాక సెప్టెంబర్ 2న హైదరాబాద్‌లో జరగబోయే ప్రీరిలీజ్ ఈవెంట్‌కి కూడా తారక్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నాడని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఈ విషయం తెలిసినప్పటి నుంచి తారక్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట.
తారక్ ఫ్యాన్స్ ఇంతలా ఆందోళన చెండానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో బాయ్‌కాట్ ట్రెండ్ నడుస్తోంది. ఎప్పటివో పాత విషయాలను తెర మీదకు లాగి ఇప్పుడు వచ్చే సినిమాలను బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజనులు పిలుపునిస్తున్నారు. ఇక బ్రహ్మాస్త్ర విషయంలో ఈ బాయ్‌కాట్ సెగ మరి కాస్త ఎక్కువగానే ఉండనుంది అంటున్నారు బాలీవుడ్ మూవీ విశ్లేషకులు. కారణం ఈ సినిమాలో నటించిన ఆలియా, రణ్‌బీర్ కపూర్‌లతో పాటు నిర్మాత కరణ్ జోహార్ అంటే బాలీవుడ్ ప్రేక్షకుల్లో విపరీతమైన నెగిటివిటీ ఉంది. లైగర్ విడుదల సమయంలో ఇది స్పష్టంగా అర్థం అయ్యింది.
ఈ క్రమంలో ఇంత నెగిటివిటీ ఉన్న బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్ బాధ్యతను తారక్ తీసుకోవడంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో, ప్రీరిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి తారక్ హాజరయితే.. తప్పకుండా వీరి గురించి పాజిటీవ్‌గా మాట్లాడాల్సి వస్తుంది. జూనియర్ అలా బ్రహ్మాస్త్ర టీం గురించి పాజిటీవ్‌గా మాట్లాడితే.. అది ప్రేక్షకులకు నచ్చకపోతే.. ఆ ఎఫెక్ట్ రానున్న తారక్ సినిమాలపై పడే అవకాశం ఉందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తూనే తారక్ ఇలాంటి స్టెప్ తీసుకోవడం అసరమా అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అయితే బ్రహ్మాస్త్ర ప్రమోషన్ కార్యక్రమాలు, ప్రీరిలీజ్ ఈవెంట్‌లో తారక్ పాల్గొంటే.. అది గతంలో చేసిన సాయానికి బదులు తీర్చుకోవడం అవుతుంది. ఎందుకంటే.. బాహుబలి, ట్రిపుల్ ఆర్ సినిమాలను బాలీవుడ్‌లోకి తీసుకెళ్లడంలో నిర్మాత కరణ్ జోహార్ ఎంతో సాయం చేశారు. అందుకు బదులుగా ఇప్పుడు తార్‌క్ బ్రహ్మాస్త్ర సినిమాకు ఈ సాయం చేయాల్సి వస్తుంది. దీన్ని తప్పుపట్టలేం కూడా. కానీ అభిమానులు మాత్రం.. తారక్ చేస్తున్నది మంచి పనే కానీ.. దాని వల్ల తనకు నష్టం జరగుతుందేమో కదా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.