రోహిణి.. సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్‌బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్‌గా వెళ్లింది. అనంతరం కొన్ని కామెడీ షోలలో కనిపించింది. ఆ తర్వాత జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీలో చేయసాగింది. ఇక రోహిణి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ షోల ద్వారా వచ్చిన గుర్తింపుతో.. ఆ తర్వాత ఏకంగా ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో టీమీ లీడర్‌గా ఎదిగింది. రౌడీ రోహిణిగా చేస్తోంది. షోలతో పాటు సినిమాల్లో కూడా చేస్తోంది రోహిణి. ఇక జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలో బూతుల గురించి ఎంత చెప్పినా తక్కువే. డబుల్ మీనింగ్ డైలాగ్‌లనే కామెడీ అనుకుంటున్నారు కొందరు టీమ్ లీడర్లు. ఈ విషయంలో హైపర్ ఆది మీద ఇప్పటికే పలు విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో రోహిణి కూడా చేరింది.
అక్టోబర్ 21న ప్రసారం కాబోయే ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. దీనిలో రోహిణి ఆహ్వానం సినిమాకు స్పూఫ్‌గా స్కిట్ చేసింది. విడాకుల గురించి సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్‌ల సీన్‌ని రోహిణి తన బూతు పంచులతో గబ్బు గబ్బు చేసింది. సినిమాలో.. విడాకులు తీసుకున్న తర్వాత సమాజంలో ఆ మహిళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది.. తప్పు చేయకపోయినా సరే.. సమాజం తనను ఎంత చులకనగా చూస్తుందో రమ్యకృష్ణ పాత్ర ద్వారా చక్కగా చెప్పించాడు దర్శకుడు. కానీ ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో రోహిణి చేసిన స్కిట్‌లో మాత్రం.. చాలా చండాలమైన డైలాగ్‌లతో ఆ సీన్ మొత్తాన్ని నాశనం చేసింది.
ఇక స్కిట్‌లో భాగంగా రోహిణి భర్తగా చేసిన వ్యక్తి.. డబ్బున్న అమ్మాయి కోసం ఆమెకు విడాకులు ఇస్తాడు. ఆ విడాకులు పత్రాలను అందరికి పంచుతుంది రోహిణి. దానిలో భాగంగా జడ్జిల దగ్గరకు కూడా వెళ్తుంది. విడాకులు ఆహ్వానపత్రాన్ని ఇచ్చాక.. రోహిణి చెప్పే డైలాగ్స్ పరమ రోతగా అనిపిస్తాయి. ఈ సందర్భంగా రోహిణి.. విడాకులు వచ్చాక నేను స్వేచ్ఛా జీవిని.. నన్ను ఎవరైనా గోకవచ్చు.. గెలకవచ్చు. నా మనసు దోచుకోవచ్చు అని చెప్తుంది. ఆ వెంటనే పక్కనే ఉన్న కృష్ణభగవాన్.. అడ్రస్ ఎక్కడ అంటూ పంచ్ వేస్తాడు.
ఈ ప్రొమో చూసిన వారు.. ఇన్ని రోజులు మగాళ్లు మాత్రమే ఇలాంటి బూతు పంచులు వేసేవారు. ఇప్పుడు వారి జాబితాలో నువ్వు కూడా చేరావా. మీ దృష్టిలో కామెడీ అంటూ బూతులేనా.. ఇంకెంత కాలం ఇలా ప్రేక్షకులను చావగొడతర్రా నాయనా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు.