ఈ మధ్య కాలంలో భారీ అంచనాల మధ్య విడుదలై.. అతి దారుణంగా ప్లాఫ్ అయిన సినిమా లైగర్. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా అనుకున్న రేంజ్‌లో హిట్ కాలేదు. మూడేళ్లు కష్టపడి, ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి.. ఈ సినిమా తీస్తే.. ఇలాంటి రిజల్ట్ వస్తుందని అనుకోలేదు అంటూ ఛార్మి ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఛార్మి, కరణ్ జోహార్‌లతో పాటు పూరి జగన్నాథ్ కూడా ఈ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలైన మొదటి షో నుంచే ప్లాఫ్ టాక్‌తో డిజాస్టర్‌గా నిలిచింది.
అన్ని భాషల్లోనూ ఈ సినిమా భారీ డిజాస్టర్‌గా నిలవడంతో.. పెద్ద ఎత్తున నష్టాలు మిగిల్చనుంది అని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ ఈ సినిమా కోసం తీసుకున్న పారితోషికంతో పాటు.. లాభాల్లో వచ్చిన వాటాలో కూడా 70 శాతం వెనక్కి ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా హీరో విజయ్ దేవరకొండ కూడా తన వంతుగా పారితోషికంలో కొంత భాగం వెనక్కి ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ‘లైగర్’ సినిమా కోసం విజయ్ దేవరకొండకి రూ.15 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నాన్ థియేట్రికల్ రైట్స్‌లో వాటా కూడా ఉంది. ఇలా మొత్తంగా లైగర్ కోసం విజయ్ తీసుకున్న పారితోషికం విలువ రూ.20 కోట్లని సమాచారం. ఈ క్రమంలో తాజాగా లైగర్ రిజల్ట్ కారణంగా.. తాను తీసుకున్న పారితోషికంలో రూ.6 కోట్ల వరకు వెనక్కి ఇచ్చేసినట్టు ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక సినిమా లాభాల్లో వాటా ఇంకా విజయ్‌కి ఇవ్వలేదట. ఆ మొత్తం ఇప్పుడు వద్దు అని విజయ్.. పూరి, ఛార్మి లతో అన్నట్టు తెలుస్తుంది.
ఇక విజయ్ తన లైగర్ సినిమా అవ్వగానే.. పూరి-ఛార్మీలతో కలిసి ‘జన గణ మన’ సినిమా చేయాలి. ఒకవేళ ఆ సినిమా సక్సెస్ సాధిస్తే అప్పుడు విజయ్ లాభాల్లో వాటా తీసుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కాక ఇక ఈ ఏడాది విజయ్ నటిస్తున్న ‘ఖుషి’ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో సమంత హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి విజయ్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.