'లైగర్' ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. కానీ అనుకోని రీతిలో ప్రేక్షకుల నుంచి ప్లాప్ టాక్ తెచ్చుకుని వెండితెర వద్ద చతికిల పడింది. దీంతో డైరెక్టర్ పూరీ పై అలాగే హీరో విజయ్ దేవరకొండపై విమర్శలు గుప్పిస్తున్నారు సినీ ప్రముఖులు. తాజాగా దర్శకనిర్మాత అయిన తమ్మారెడ్డి భరద్వాజ లైగర్ హీరోపై విరుచుకుపడ్డారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. తమ్మారెడ్డి భరద్వాజ.. తనదైన శైలిలో సినీ విమర్శలు చేస్తూ ఉంటారు. సినిమా మంచిగా ఉంటే మంచి అని లేకపోతే లేదు అని ఆయన నిక్కచ్చిగా చెబుతారు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లైగర్ మూవీ పై అలాగే హీరో విజయ్ దేవరకొండపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఇటీవల భారీ అంచనాల నడుమ వచ్చిన లైగర్ మూవీ ప్లాప్ పై మీ అభిప్రాయం ఏంటి? అని యంకర్ ప్రశ్నించగా.. తమ్మారెడ్డి సమాధానం ఇస్తూ.." హీరోలు ఊరికే ఎగిరెగిరి పడటం మంచిది కాదు. అలాగే ఇష్టం వచ్చినట్లు స్టేట్ మెంట్లు దేశాన్ని ఊపేస్తాం.. తగలెడతాం.. అంటే ఇలాగే ప్రేక్షకులు మనల్ని తగలెడతారు. అంటూ ఆక్రోశించారు. అదీ కాక అయ్యా దండం పెడతాం మంచి సినిమా తీశాం.. మీరు చూడండి అని అడిగితే చూస్తారు గానీ ఇలా చిటికెలు వేసి చెబితే.. వారు చిటికెలు వేసి ప్లాప్ చేస్తారు'' అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. సార్ లైగర్ లెక్క ఎక్కడ తప్పింది అంటారు? అని యాంకర్ ప్రశ్నించగా.. ఇక వద్దు దాని గురించి ఇంత చెప్పా మీరే అర్దం చేసుకోవాలి అని అంటూనే.. నేను లైగర్ మూవీ ట్రైలర్ చూసినప్పుడే ఆ సినిమాని చూడాలనుకోలేదు. భవిష్యత్తులో చూడాలి అనిపిస్తే చూస్తానేమో! ఇక నేను పూరీ జగన్నాథ్ కు అభిమానిని. ఆయన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం అని వెల్లడించారు. మరి బాయ్ కాట్ ట్రెండ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే.. అది పనీపాట లేని వారు చేసే ప్రచారం అని కొట్టిపారేశారు. సోషల్ మీడియా యుగంలో ఇది సర్వసాధారణం అయిపోయిందని అన్నారు. ఇండస్ట్రీలో 95 శాతం సినిమాలు ప్లాప్ సినిమాలే అని కేవలం 5 శాతం మాత్రమే హిట్ అవుతాయి అని ఆయన పేర్కొన్నాడు. ఈ మధ్య డబ్బింగ్ మూవీలు సైతం బాగా ఆడుతున్నాయని అన్నారు. మరి తమ్మారెడ్డి భరద్వాజ హీరో విజయ్ పై చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: Chiranjeevi: దర్శకులకు మరోసారి మెగాస్టార్ సూచనలు! ఆచార్యపై పరోక్షంగా కామెంట్స్! ఇదీ చదవండి: Aamir Khan: ఆమిర్‌ఖాన్ సంచలన నిర్ణయం.. లాల్ సింగ్ చడ్డా నష్టాన్ని భరించేందుకు రెడీ!