ఈ మధ్యకాలంలో కొత్తగా ఏ సినిమా విడుదలైనా.. గతంలో సేమ్ జానర్ లో వచ్చిన సినిమాలను కంపేర్ చేస్తూ చూస్తున్నారు. అందులోనూ.. జానర్ తో పాటు థీమ్ కూడా ఒకేలా అనిపిస్తే, కచ్చితంగా పాత సినిమాలను తవ్వి... అలా ఉంది, ఇలా ఉందని నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. అలా చెప్పడం గురించి పక్కన పెడితే.. ఒక సినిమాని మరో సినిమాతో కంపేర్ చేయడమనేది దాని ఫలితంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని మాత్రం పక్కాగా చెప్పొచ్చు. ఈ చర్చ ఇటీవల విడుదలైన లైగర్ మూవీ విషయంలో కూడా జరిగింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని రూపొందించాడు. అయితే.. అటు విజయ్ కి, ఇటు పూరీకి ఇద్దరి కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీగా రూపొందిన లైగర్ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. సినిమా ప్రారంభం నుండి ఎండ్ వరకూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయలేకపోయింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన లైగర్.. కలెక్షన్స్ పరంగా చాలా వెనకబడింది. ఇదిలా ఉండగా.. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన లైగర్ కి ప్రమోషన్స్ బాగానే చేశారు. అయితే.. సినిమాలో కథ రొటీన్ అయినా.. పూరీ మ్యాజిక్ ఏదైనా చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ సినిమాలో కథాకథనాలు పక్కన పెడితే.. మినిమమ్ లాజిక్స్ కూడా లేకపోవడం భారీ ప్లాప్ కి దారి తీశాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సినిమాలో హీరో తన తల్లితో కలిసి బాక్సింగ్ లో ఛాంపియన్ కావాలని ముంబయికి మకాం మార్చుతాడు. అక్కడి వరకూ బాగానే ఉంది.. కానీ.. హీరో తండ్రి పేరు బలరామ్ అని, అతను కూడా బాక్సింగ్ లో ఛాంపియన్ గా చనిపోయాడని చెప్పడం గమనార్హం. ఇక హీరో ఓడిపోయే సమయంలో ఎదుటివాడిని తన తండ్రిని చంపినవాడిగా భావించి ఫైట్ చేయాలని తల్లితో చెప్పించారు. కానీ.. అసలు హీరో తండ్రి బలరామ్ ఎవరు? అతను ఎలా ఫైట్ చేసేవాడు? అతని నేపథ్యం ఏంటనేది ఎక్కడకుడా మెన్షన్ చేయకపోవడం, చూపించకపోవడం పెద్ద మైనస్ అనే చెప్పాలి. ఈ క్రమంలో సినిమాలో హీరో తండ్రిని చూపించకపోవడం కూడా సినిమా డ్రా బ్యాక్స్ లో ఓ కారణమని చెబుతున్నారు. ఒకవేళ హీరో తండ్రి క్యారెక్టర్ ని చూపించి ఉంటే.. సినిమాని 'అమ్మా నాన్న తమిళమ్మాయి'లా తీశారని చెప్పి కొట్టిపారేసే అవకాశం ఉందని మేకర్స్ భావించి ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదుగాని.. మొత్తానికి లైగర్ సినిమాకి ఇలాంటి లాజిక్స్ మిస్ అవ్వడంతో ప్లాప్ ఫలితమే మిగిలిందని అంటున్నారు. మరి లైగర్ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Liger రిజల్ట్.. ఇలా జరుగుతుంది అనుకోలేదంటూ ఛార్మి ఎమోషనల్!