ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తోన్న పేరు లైగర్. రిలీజ్‌కు ముందు.. విడుదల తర్వాత కూడా ఈ సినిమా పేరు అందరి నోళ్లలో నానుతూనే ఉంది. కారణం.. విడుదలకు ముందు సినిమా టీం చేసిన ప్రమోషన్స్ హైలెట్‌గా నిలవగా.. ఇక విడుదల తర్వాత సినిమా చూసిన ప్రేక్షకులు.. ఈ మాత్రం సినిమా కోసం మీరు ఇంత ఓవరాయక్షన్ చేశారా అని ముఖం మీదే చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ప్రమోషన్ సమయంలో విజయ్ చేసిన వ్యాఖ్యలు, సినిమాపై నమ్మకంతో ఛార్మి భారీ ఓటీటీ ఆఫర్‌ని వదులుకున్నానంటూ చెసిన కామెంట్స్‌పై ప్రస్తుతం నెటిజనులు ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. సినిమాపై విపరీతమైన నమ్మకంతో ఓటీటీ ఆఫర్‌ను కాదనుకున్న ఛార్మి ప్రస్తుతం తెగ బాధపడుతున్నట్లు సమాచారం. ఆ వివరాలు.. కథ, పూరి జగన్నాథ్ మీద నమ్మకంతో ఛార్మి లైగర్ సినిమా కోసం భారీగా ఖర్చు చేసినట్లు సినిమా ప్రమోషన్ సమయంలోనే చెప్పింది ఇప్పటి వరకు తన కెరీర్‌లో సంపాదించుకున్న మొత్తాన్ని ఈ సినిమాకు ఖర్చు చేసిందట. అయితే పూరిపై ఛార్మి పెట్టుకున్న అతి నమ్మకం.. ఆమె కొంప ముంచిందట. ఇక సినిమా విడుదలైన ఫస్ట్ షోకే రిజల్ట్ తెలియడం.. దారుణమైన ప్లాఫ్ టాక్ తెచ్చుకోవడంతో.. ఛార్మి కంగుతిన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఛార్మి తన సన్నిహితుల దగ్గర ఎమోషనల్ అయిందట. లైగర్ సినిమా తన కెరీర్ గ్రాఫ్ దారుణంగా పడిపోయినట్లు సన్నిహితుల దగ్గర ఎమోషనల్ అయినట్లు సమాచారం. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: ‘లైగర్’లో హీరోకి నత్తి పెట్టింది అందుకే! పూరి అంత తెలివిలేనోడు కాదు! ఇది కూడా చదవండి: విజయ్ దేవరకొండపై విరుచుకుపడిన థియేటర్ ఓనర్.. ఒక్క టికెట్ కూడా తెగట్లేదంటూ!