ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్ధీన్ సిద్ధిఖీ తరచూ ఏదో ఒక వివాదంలో నిలుస్తూ ఉన్నారు. భార్యతో గొడవలు ఇప్పటికి కూడా సద్దుమణగలేదు. ఈ లోపే మరో వివాదం తెరపైకి వచ్చింది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్ధీన్ సిద్ధిఖీ తనను దుబాయ్‌లో వదిలేయటం కారణంగా తాను చాలా ఇబ్బందులు పడుతున్నానని, తినడానికి కూడా తిండిలేక అల్లాడిపోతున్నానని నటుడి పని మనిషి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు ఓ వీడియోలో తన కన్నీటి గాథను వెళ్లబోసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నవాజుద్ధీన్ సిద్ధిఖీ భార్య ఆలియా సిద్ధీఖీ తరపు న్యాయవాది తన ట్విటర్ ఖాతాలో ఆదివారం ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో ఓ యువతికి సంబంధించిన వీడియోతో పాటు.. ఆ యువతి నవాజుద్ధీన్ సిద్ధిఖీతో ఉన్న ఫొటోలను కూడా షేర్ చేశారు. వాటితో పాటు ఓ నోట్ కూడా ఉంది.
ఆ నోట్‌లో.. నవాజుద్ధీన్ సిద్ధిఖీ స్వప్న రోబిన్ మాసిహ్ అనే యువతిని 2022 నవంబర్ నెలలో పనిలోకి తీసుకున్నాడు. ఆమెను తన పిల్లలను చూసుకోవటానికి పనిలో పెట్టుకున్నాడు. ఆ సమయంలో ఆయన పిల్లలు దుబాయ్‌లో ఉన్నారు. వారిని చూసుకోవటానికి స్వప్న దుబాయ్ వెళ్లింది. దుబాయ్ రికార్డ్స్‌లో కూడా ఆమె నవాజుద్దీన్ ఇంటి పని మనిషి అని ఉంది. అంతేకాదు.. ఆమె ఓ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా కూడా పని చేస్తోందని కూడా ఉంది. అయితే, పనిలో చేరినప్పటినుంచి ఆమెకు ఎలాంటి జీతం రావటం లేదు. వివిధ కారణాలు చెప్పి జీతాన్ని ఇవ్వటం లేదు. తిండికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది.
ఈ నేపథ్యంలో స్వప్న ఈ విషయాన్ని నావాజుద్ధీన్ సిద్ధిఖీ భార్య ఆలియాకు చెప్పింది. ఆమె తన లాయర్ ద్వారా ఈ విషయాన్ని బయటి ప్రపంచానికి తెలిసేలా చేసింది. ప్రస్తుతం ఆలియా, ఆమె తరపు న్యాయవాది స్వప్నకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, నావాజుద్ధీన్ సిద్ధిఖీ, అతడి భార్య ఆలియాకు మధ్య గత కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విడాకులు తీసుకుందామని భావించారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆగిపోయారు. ఆలియా నావాజుద్ధీన్ సిద్ధిఖీతో కలిసి పోవాలని చూస్తోంది. అయితే, అతడి కుటుంబం మాత్రం ఇందుకు ఒప్పుకోవటం లేదు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The video & my statement speaks for itself. Govt authorities are requested to urgently rescue the house help of @Nawazuddin_S from Dubai where the girl is in a state of Solitary Confinement@cgidubai @UAEembassyIndia @LabourMinistry @HRDMinistry@MEAIndia @CPVIndia @OIA_MEA pic.twitter.com/EyQ8DiHPG2
— Advocate Rizwan Siddiquee (@RizwanSiddiquee) February 19, 2023