ఈ ఫోటోలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకరు మార్షల్ ఆర్ట్స్ కోచ్ కాగా.. మరొకరు ప్రముఖ హీరో. మరి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న ఈ హీరోని గుర్తుపట్టారా? ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్, పరపతి కలిగిన కుటుంబం నుంచి వచ్చిన హీరో. ఎవరో గెస్ చేయండి.
హీరోలు ఊరికే అయిపోరు. దానికొక డెడికేషన్ ఉండాలి. చాలా కష్టపడాలి. చెమటోడ్చి పని చేయాలి. శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలి. అవసరమైతే కరాటే బ్లాక్ బెల్ట్, రెడ్ బెల్ట్, మార్షల్ ఆర్ట్స్ వంటివి నేర్చుకోవాలి. దీనికి చాలా సహనం, ఓపిక కావాలి. ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఎవరికి వారు సొంతంగా ఒక గ్రౌండ్ ని సెట్ చేసుకోవాలి. ఈ విషయంలో ఈ హీరో కూడా అలానే భావించారు. డబ్బు, పలుకుబడి ఉన్నంత మాత్రాన నటన రాకపోయినా, కష్టపడకపోయినా మంచి పేరు వస్తుందా చెప్పండి. అందుకే ఎంత డబ్బు, పరపతి ఉన్నా కూడా హీరోలు ఆరు పదుల వయసులోనూ కష్టపడుతుంటారు. ఇక ఈ ఫోటోలో ఉన్న హీరో కూడా కెరీర్ తొలినాళ్లలో సినిమాల మీద అభిరుచితో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. సెలబ్రిటీలకు సంబంధించి చైల్డ్ హుడ్ ఫోటోలు, త్రో బ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలో ఓ ప్రముఖ హీరోకి సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.
ఆయన ఇండస్ట్రీకి పరిచయమవుతూనే వరల్డ్ రికార్డుని సెట్ చేశారు. ఇండస్ట్రీకి పరిచయమవుతూ వరుసగా తొమ్మిది సినిమాలకు సైన్ చేసిన ఘనత ప్రపంచంలోనే తొలిసారి. ఒకేరోజు 9 సినిమాలకు సంతకం చేసి రికార్డ్ సృష్టించారు. కానీ తొమ్మిది సినిమాల్లో కొన్ని ఆదిలోనే ఆగిపోయాయి. ఇప్పటికైనా గుర్తుపట్టారా? ఆయన మరెవరో కాదు నందమూరి తారక రామారావు మనవడు నందమూరి తారకరత్న. ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. తారక్, భద్రాద్రి రాముడు, నో, యువరత్న వంటి సినిమాల్లో నటించి మెప్పించారు. హీరోగానే కాకుండా అమరావతి లాంటి సినిమాలో విలన్ గా కూడా నటించి అదరగొట్టారు. ఈ సినిమాలో తారకరత్న నటనకు నంది అవార్డు దక్కింది.
సినిమాలే కాకుండా 9 అవర్స్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించారు. ఈ సిరీస్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఈయన నటించిన చివరి సినిమా సారధి. ఆ సినిమా విడుదల కాకుండానే కన్నుమూశారు. ఇటీవలే ఆయన గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. నటుడిగా అలరించిన తారకరత్న రాజకీయాల్లో కూడా రాణించాలని అనుకున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయాలని అనుకున్నారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన వెళ్లిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కూడా ఇవ్వాలని అనుకున్నట్లు కొరటాల శివ వెల్లడించిన విషయం తెలిసిందే. అలానే ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ కేలో పాత్ర సిద్ధం చేసినట్లు నిర్మాత అశ్వినీదత్ వెల్లడించారు.
నిజంగా తారకరత్న ఈ సినిమాలు చేసి ఉంటే ఒక రేంజ్ లో ఉండేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్, తారకరత్న ఒకే ఫ్రేములో కనిపిస్తే ఎంత చూడముచ్చటగా ఉంటుందో. కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది. ఆయన వచ్చిన పని అయిపోయినట్టుంది అందుకే వెళ్లిపోయారు. దేవుడు తీసుకెళ్లిపోయారు. ఇంతకే తారకరత్నకు మార్షల్ ఆర్ట్స్ నేర్పింది ఎవరో తెలుసా? ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ కోచ్ విజయ్ శేఖర్. తారకరత్న మృతి పట్ల ఆయన చాలా దిగ్భ్రాంతికి గురయ్యారు. తారకరత్న గురించి ఎన్నో విషయాలు చెప్పారు. కింద వీడియో ఉంది చూడగలరు. మరి తారకరత్న మార్షల్ ఆర్ట్స్ శిక్షణ తీసుకున్నారని మీలో ఎంతమందికి తెలుసు? తారకరత్న మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకోవడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.