పిల్లలు చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉంటారు. ఇప్పుడంటే డిజిటల్ కెమెరాలు, సెల్ ఫోన్లు వచ్చాయి కాబట్టి సందర్భం లేకపోయినా పిల్లల ఫోటోలు, వీడియోలు తీసేసి సోషల్ మీడియాలో పెట్టేసుకుంటున్నారు. ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగిపోయింది 5 దశాబ్దాల క్రితం ఇంత కలర్ టెక్నాలజీ లేదు. అప్పుడంతా బ్లాక్ అండ్ వైట్ లోకమే. ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు తల్లిదండ్రులు.. పిల్లల్ని వెంటబెట్టుకుని స్టూడియోకి వెళ్లి ఫోటోలు దిగేవారు. ఆ కాలంలో పుట్టిన వాళ్లకి ఇదొక మంచి అనుభూతి. అలాంటి అనుభూతిని పొందిన హీరోయినే ఈ ఫోటోలో ఉన్న చిన్నారి. ఈ చిన్నారిని గుర్తుపట్టారా? పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, బాలకృష్ణలతో కలిసి నటించింది.
త్రో బ్యాక్ ఫోటోలు, చైల్డ్ హుడ్ ఫోటోలు అని సెలబ్రిటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ కి సంబంధించిన చిన్నప్పటి ఫోటో కూడా నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది. ఈమె బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సరసన ‘కహో నా ప్యార్ హై’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాకి బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డులు కూడా దక్కించుకుంది. ఆమె మరెవరో కాదు అమీషా పటేల్. తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బద్రి సినిమాలో హీరోయిన్ గా నటించింది. మొదటి సినిమాతోనే టాలీవుడ్ లోనూ సూపర్ హిట్ అందుకుంది.
ఆ తర్వాత మహేష్ బాబు సరసన నాని సినిమాలో నటించింది. ఎన్టీఆర్ తో నరసింహుడు, బాలకృష్ణతో పరమవీరచక్ర సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. సన్నీడియోల్ సరసన నటించిన గదర్: ఏక్ ప్రేమ్ కథ సినిమా ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత హిందీలో అనేక సినిమాల్లో నటించింది. కానీ అవేమీ ఆమెకు ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయాయి. 2017లో తెలుగులో వచ్చిన ఆకతాయి సినిమాలో స్పెషల్ సాంగ్ లో నర్తించింది. ప్రస్తుతం ఈమె నటించిన మిస్టరీ ఆఫ్ టాటూ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. మరోవైపు గదర్ 2: ది కథ కంటిన్యూస్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా అప్పట్లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మరి ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచిన గదర్ మొదటి భాగంలానే ఈ రెండో భాగం కూడా అంతే స్థాయిలో హిట్ కొడుతుందా? లేదా? చూడాలి.
ఇక అమీషా పటేల్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఆమె గుజరాతీ కుటుంబంలో జన్మించింది. ముంబైలో జన్మించిన అమీషా.. ఐదేళ్ల వయసులో భరతనాట్యం నేర్చుకుంది. ఈమె తండ్రి పేరు అమిత్, తల్లి పేరు ఆశ. అమిత్ లోని మొదటి మూడు అక్షరాలను.. అలానే ఆశ పేరులోని ఆఖరి మూడు అక్షరాలను కలిపి పెట్టారు అమీషా పటేల్ అని. చదువు పూర్తి చేసిన తర్వాత ఎకనామిక్ అనలిస్ట్ గా జాబ్ చేసేది. సత్యదేవ్ దుబే థియేటర్ గ్రూప్ లో చేరి నాటకాలు నటించేది. అదే సమయంలో మోడలింగ్, పలు కమర్షియల్స్ లో లో చేసింది. బజాజ్, ఫెయిర్ అండ్ లవ్లీ, లక్స్ వంటి అనేక బ్రాండ్లకు మోడల్ గా వ్యవహరించింది. ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తుంది. అందరి హీరోయిన్స్ లానే సోషల్ మీడియాలో గుబులు పుట్టించే ఫోటోలను షేర్ చేస్తుంది. 50 చేరువలో ఉన్నా కూడా తగ్గేదేలే అని బోల్డ్ ఫోటోలు పెడుతూ.. ఫ్యాన్స్ అటెన్షన్ ని డ్రా చేస్తుంది. అదన్నమాట విషయం.