ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కనిపిస్తున్న ఈయనను గుర్తుపట్టారా? చిరు, పవన్ కు సంబందించిన వింటేజ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో చిరు, పవన్ తో ఉన్న వ్యక్తి ఎవరబ్బా అని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. మరి ఆయనెవరో తెలుసా?
సెలబ్రిటీలకు సంబంధించి చైల్డ్ హుడ్ ఫోటోలు, త్రోబ్యాక్ ఫోటోలు, వింటేజ్ లుక్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంటాయి. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లకు సంబంధించి ఒక వింటేజ్ పిక్ ఒకటి సోషల్ మీడియా తవ్వకాల్లో బయటపడింది. ఈ ఫోటోలో చిరంజీవి కళ్ళజోడు పెట్టుకుని స్టైల్ గా కనబడుతుంటే. పవన్ కళ్యాణ్ ఎవరినో చూస్తున్నారు. ఇక మరొక వ్యక్తి చిరంజీవిని చూస్తున్నారు. చూస్తుంటే ముగ్గురూ ఏదో చర్చించుకుంటున్నట్టు అనిపిస్తుంది. అసలు చిరు, పవన్ తో ఉన్న ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? మీరేమైనా ఆ వ్యక్తిని గుర్తుపట్టారా? ఆయన చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో కలిసి పని చేశారు. ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తండ్రి కూడా.
ఆయన మరెవరో కాదు.. గొర్తి సత్యమూర్తి. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తండ్రి. తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలంలోని వెదురుపాక గ్రామంలో 1953 మే 24న జన్మించారు. బీ.ఈడీ పూర్తి చేసిన ఈయన కళాశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. సాహిత్యం మీద ఉన్న అభిరుచి ఆయనను వ్యాసం రాసేలా ప్రేరేపించింది. ఆ సాహిత్య ప్రయాణాన్ని చైతన్యం అనే నవల రాయడంతో ప్రారంభించారు. పవిత్రులు, పునరంకితం, దిగంబర అంబరం వంటి నవలలు సాహిత్య ప్రియులకు ఎంతగానో వినోదాన్ని పంచాయి. మానవ సంబంధాల మధ్య తలెత్తే సంఘర్షణను ఆధారం చేసుకుని ఆయన రాసిన కథలకు, నవలలకు కథా రచయితగా, నవలా రచయితగా ఎంతో గుర్తింపు వచ్చింది. అదే ఆయన సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టేలా చేసింది.
సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సత్యమూర్తి.. డైలాగ్ రైటర్ గా పలు సినిమాలకు పని చేశారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన దేవత సినిమాతో కథా రచయితగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సక్సెస్ తో కథా రచయితగా సత్యమూర్తి కెరీర్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. వరుస పెట్టి అవకాశాలు వచ్చి పడ్డాయి. శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు వంటి హీరోలతో పని చేశారు. బావా మరదళ్ళు, కిరాయి కోటిగాడు, ఖైదీ నంబర్ 786, అభిలాష, పోలీస్ లాకప్, ఛాలెంజ్, బంగారు బుల్లోడు, భలే దొంగ, అమ్మ దొంగ, చంటి, పెదరాయుడు, మాతృదేవోభవ వంటి సూపర్ హిట్ సినిమాలకు కథలు అందించారు.
400కు పైగా చిత్రాలకు కథా రచయితగా పని చేసిన ఈయన పవన్ కళ్యాణ్ నటించిన గుడుంబా శంకర్, జానీ సినిమాలకు కూడా పని చేశారు. కథా రచయితగానే కాకుండా మాటల రచయితగా, కథన రచయితగా కూడా అనేక సినిమాలకు పని చేశారు. కథా రచయితగా దాదాపు 90 సినిమాలకు పని చేసిన ఆయన.. దాదాపు 400 సినిమాలకు మాటల రచయితగా పని చేశారు. ఈయన తన కెరీర్ లో ఎక్కువగా చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమాలకు పని చేశారు. ఈయన 2015 డిసెంబర్ 14న చెన్నైలో మరణించారు. మరి చిరంజీవి, బాలకృష్ణ, కృష్ణ, మోహన్ బాబు వంటి హీరోలకు సూపర్ హిట్స్ ఇచ్చిన సత్యమూర్తిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.