ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అనేది త్వరగా కెరీర్ ప్రారంభించడానికి ప్లస్ అవుతుందేమో. కానీ, సక్సెస్ లో మాత్రం ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏమాత్రం సపోర్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే.. ఎప్పటికైనా సినిమా కథలు ఎంపిక చేసుకోవాల్సింది, సక్సెస్ కొట్టాల్సింది సొంతంగానే. ఇప్పుడు మీరు పైన ఫొటోలో చూస్తున్న పాప.. ఎవరో తెలుసా? ఆమె కూడా ఇండస్ట్రీలోకి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తోనే అడుగుపెట్టింది.
ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అనేది త్వరగా కెరీర్ ప్రారంభించడానికి ప్లస్ అవుతుందేమో. కానీ, సక్సెస్ లో మాత్రం ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏమాత్రం సపోర్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే.. ఎప్పటికైనా సినిమా కథలు ఎంపిక చేసుకోవాల్సింది, సక్సెస్ కొట్టాల్సింది సొంతంగానే. అయితే.. కొందరి విషయాలలో మాత్రం ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కన్నా.. అదృష్టం కలిసి రావచ్చు. అలాంటి వారిని మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. కానీ.. హార్డ్ వర్క్, స్టోరీస్ ని సరిగ్గా జడ్జి చేయగలిగే నాలెడ్జ్ ఉన్నప్పుడే కెరీర్ లో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్స్ కెరీర్ లో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు మీరు పైన ఫొటోలో చూస్తున్న పాప.. ఎవరో తెలుసా? ఆమె కూడా ఇండస్ట్రీలోకి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తోనే అడుగుపెట్టింది. కానీ.. మొదట్లో స్ట్రగుల్ అయినప్పటికీ.. మూడో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని.. ఇండియా వైడ్ సెన్సేషన్ అయ్యింది. కట్ చేస్తే.. కొన్నాళ్ళకు తెలుగు మూవీతో పాన్ ఇండియా వైడ్ పరిచయం అయ్యింది. మంచి ఫేమ్ వచ్చింది.. కానీ, ఊహించిన సక్సెస్ అయితే రాలేదు. దీంతో తిరిగి మళ్లీ తాను కెరీర్ స్టార్ట్ చేసిన ఇండస్ట్రీలోనే బిజీ అయ్యింది. కొన్నాళ్లుగా సాలిడ్ సక్సెస్ కోసం ట్రై చేస్తోంది అమ్మడు. అదీగాక డీసెంట్ రోల్స్ నుండి రొమాన్స్, బెడ్ సీన్స్.. ఇలా దేనికి వెనుకాడకుండా దూసుకుపోతోంది. ఇప్పటికీ మీకు ఆ బ్యూటీ ఎవరో గుర్తు రాలేదా?
ఇప్పుడు ఆ గ్లామరస్ హీరోయిన్ ఎవరనే విషయంలోకి వస్తే.. డార్లింగ్ ప్రభాస్ సరసన ‘సాహో’ మూవీ చేసింది. ఎస్.. ఆ బ్యూటీనే శ్రద్ధా కపూర్. ఆషీకీ 2 మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. సాహో సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. కొన్నాళ్లుగా సరైన హిట్స్ లేక.. గ్లామర్ రోల్స్ కి ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. అదీగాక రీసెంట్ గా రణబీర్ కపూర్ సరసన నటించిన ‘తూ ఝూటి మై మక్కార్’ మూవీలో ఏకంగా టు పీస్ బికినీ సీన్ చేసి ఒక్కసారిగా షాకిచ్చింది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో కోట్లలో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన శ్రద్ధా.. సింగర్ కూడా మంచి ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం శ్రద్ధాకి సంబంధించి చిన్ననాటి పిక్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. మరి శ్రద్ధా కపూర్ గురించి, ఆమె సినిమాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.