సెలబ్రిటీలు సామాన్యులు మాదిరి.. బయట తిరిగి.. తమకు నచ్చినట్లు జీవించడం చాలా కష్టం. వారు బయట కనిపిస్తే చాలు అభిమానులు చుట్టుముడతారు. అందుకే చాలా మంది సెలబ్రిటీలు.. మారు వేషాల్లో.. అర్థరాత్రి పూట బయటకు వస్తుంటారు. తమ పని పూర్తి చేసుకుని వెళ్తారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి కూడా ఇదే పని చేశారు. అర్థరాత్రి పూట.. చార్మినార్ నైట్ బజార్ అందాలను తిలకించారు. కుమారుడు కార్తికేయతో కలిసి.. బిర్యానీ తిన్నారు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: ఇండియన్ సినిమాపై టాలీవుడ్ మార్క్! ఫ్యూచర్ అంతా మనదే!
మిగతా సమాయాల్లో కన్నా.. రంజాన్ వేళ చార్మినార్ చూస్తే.. ఆ కిక్కేవేరు. రంగు రంగుల దీప కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. అర్థరాత్రి 2 దాటిన షాపింగ్ కొనసాగుతూనే ఉంటుంది. అలాంటి రంజాన్ వేళ దర్శకుడు రాజమౌళి.. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కనిపించారు. పాతబస్తీలోని చార్మినార్ పరిసర ప్రాంతాలలో అర్ధరాత్రి జక్కన్న పర్యటించారు.
ఇది కూడా చదవండి: RRRలో రామ్ చరణ్ డామినేషన్ పై స్పందించిన రాజమౌళి!
ఓ సాధారణ వ్యక్తిగా రాజమౌళి నైట్ బజార్ అందాలని తిలకించారు. నైట్ బజార్ మొత్తం తిరిగిన రాజమౌళి.. అక్కడి జనాలతో కలిసిపోయారు. అక్కడే ఉన్న హోటల్ లో తన కుమారుడి కార్తికేయ తో కలిసి బిర్యానీ తిని వెళ్ళిపోయారు. సాధారణ వ్యక్తిగా ప్రజల్లో కలిసిపోవడంతో పాతబస్తీ ప్రజలు ఎవరు రాజమౌళిని గుర్తు పట్టలేకపోయారు. హోటల్ నుంచి వెళ్లే సమయంలో కొంతమంది గడ్డం చూసి ఆయనను గుర్తుపట్టారు. ఇతను రాజమౌళి డైరెక్టర్ లాగా ఉన్నాడు అనుకుంటూ.. దగ్గరికి వెళ్లి ‘‘సార్, మీరు రాజమౌళి డైరెక్టర్ గారు కదా!’’ అని అడిగారు. తమ కళ్ల ముందు ఉన్న వ్యక్తి జక్కన్నే అని తెలయిడంతో.. అక్కడ ఉన్న యువకులు చాలా ఉత్సాహంగా రాజమౌళితో సెల్ఫీ దిగారు. జక్కన్న చార్మినార్ వచ్చారనే వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: జాన్ అబ్రహం అటాక్ వసూళ్లపై నెటిజన్స్ సెటైర్లు.. ‘కలెక్షన్స్ చూస్తే తెలుస్తోందిలే మీ నంబర్ ఎంతో’