ఏపి ప్రభుత్వం తాజాగా సినిమా టికెట్స్ ధరలను నిర్ణయిస్తూ ఓ పట్టికను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇదే కాకుండా గతంలో షోలు కూడా తగ్గిస్తున్నామంటూ తెగేసి చెప్పింది. ఇక ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయాన్ని టాలీవుడ్ లోని కొందరు సినీ ప్రముఖుల వ్యతిరేకించారు. అయితే తాజాగా ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు సినిమా టికెట్స్ ధరలు, షోలపై స్పందించారు. నాకు ఇండస్ట్రీలో ఉన్న అనుభవంతో చెబుతున్నాను దయచేసి అర్థం చేసుకోండి అని అన్నారు.
మనం ఎప్పుడు కూడా ములాల్నీ మరిచిపోకూడదు. నేను ఈవాళ ఈ పొజిషన్ లో ఉండాటానికి కారణం ముందుగా ప్రేక్షకులేనని అన్నారు. ప్రస్తుతం టికెట్లు, షోల నిర్ణయంతో చాలా మంది తీవ్ర నష్టాలకు గురువుతారన్నారు. ఇక షోలు తగ్గించడం వలన కానీ, టికెట్ల ధరలను తగ్గించడం వలన కానీ అందరూ నష్టపోతారని రాఘవేంద్రరావు అన్నారు. అయితే 10 శాతం అవరేజ్ ఇది అందరికీ తెలిసిన సత్యం. ఆన్ లైన్ వలన దోపిడి ఆగిపోతుంది అనడం కరెక్ట్ కాదు. ప్రేక్షకుడు ఒక మంచి సినిమా చూడాలనుకుంటే టికెట్ రూ.300 ఉన్నా రూ. 500 ఉన్నా చూస్తాడు.
ఇక ఒక రూపాయికే సినిమా చూపిస్తామన్నా అతనికి నచ్చని సినిమా చూడడని రాఘవేంద్ర రావు తెలిపారు. పైగా ఆన్ లైన్ లో చాలా మంది ఇన్ఫ్యూలెన్స్ ఉన్నవాళ్లు బ్లాక్ చేసుకుని వాళ్ల శిష్యుల ద్వారా బ్లాక్ లో అమ్మవచ్చు. ఇక అదే రేట్లు పెంచి ఆన్ లైన్ లో అమ్మితే థియేటర్ల వలన ప్రభుత్వానికి ఎక్కువ టాక్స్ వస్తుంది. ఈ అంశాలను ద్రుష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగిన న్యాయం చేకూర్చాలని ఆశిస్తున్నానని రాఘవేంద్రరావు తన ఆవేదనను తెలియజేశారు.